ATP Cup 2022: ఏటీపీ టోర్నీకి జకోవిచ్ దూరం

author img

By

Published : Dec 30, 2021, 8:09 AM IST

djokovic

ATP Cup 2022: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ వచ్చే ఏడాది జరగనున్న ఏటీపీ కప్​ టోర్నీకి దూరమవుతున్నట్లు తెలిపాడు. దీనికి కారణమేంటన్నది తెలియాల్సి ఉంది.

ATP Cup 2022: ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ ఆస్ట్రేలియాలో జరిగే ఏటీపీ కప్‌ టోర్నీకి దూరమవుతున్నట్లు తెలిపాడు. ఎందుకు అన్నది వెల్లడించలేదు. దీంతో అతడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలో దిగేది అనుమానంగా మారింది.

కొవిడ్‌-19 టీకా తీసుకున్న వారినే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు అనుమతిస్తామని నిర్వాహకులు స్పష్టం చేసినప్పటి నుంచి జకోవిచ్‌ ఈ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడకపోవచ్చన్న చర్చ మొదలైంది. టీకా తప్పనిసరి చేయడంపై అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో జకోవిచ్‌.. ఫెదరర్‌, నాదల్‌లతో సమానంగా ఉన్నాడు.

నిర్వాహకులు చెప్పినా..

జకోవిచ్ ఏటీపీ కప్​లో సెర్బియా తరఫున ఆడనున్నాడని ఇటీవలే టోర్నీ నిర్వాహకులు చెప్పారు. సిడ్నీ వేదికగా జనవరి 1 నుంచి 9 వరకు జరగనున్న ఈ టోర్నీలో 16 దేశాలు పాల్గొంటాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ టాప్​ 20 ఆటగాళ్లలో 18 మందిని ఎంపిక చేసినట్లు టోర్నీ నిర్వాహకులు పేర్కొన్నారు. అందులో జకోవిచ్​ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. కానీ, జకో ఈ టోర్నీకి దూరమవుతున్నట్లు పేర్కొనడం గమనార్హం.

ఇదీ చదవండి:

Australian Open: ఆస్ట్రేలియన్​ ఓపెన్​కు జకోవిచ్ దూరం?

ATP Cup 2022: ఏటీపీ కప్​లో ఆడనున్న జకోవిచ్

Wimbledon 2022: వింబుల్డన్‌కూ ఫెదరర్‌ దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.