అది ఫుట్​బాల్​ క్రేజ్​.. 40వేల అడుగుల ఎత్తులోనూ..

author img

By

Published : Dec 1, 2022, 10:18 AM IST

Updated : Dec 1, 2022, 11:44 AM IST

Foot ball in Aeroplane

ప్రపంచవ్యాప్తంగా ఫుట్​బాల్​కు ఉన్న క్రేజ్​ గురించి తెలిసిందే. అయితే ఈ ఆటకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. 40 వేల అడుగుల ఎత్తులోనూ ఈ ఈ గేమ్​ క్రేజ్​ ఏ మాత్రం దక్కలేదు.

ప్రపచంలో జరిగే క్రీడల మెగా టోర్నీలో ఫిఫా వరల్డ్‌ కప్‌ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఎక్కడున్నా మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం ఫుట్‌బాల్‌ మెగా టోర్నీ ఫిపా వరల్డ్‌కప్‌ 2022 జరుగుతోంది. తమ అభిమాన జట్ల ఆటను చూసేందుకు ఎంతో మంది అభిమానులు తహతహలాడిపోతుంటారు. కానీ, ప్రత్యక్షంగా చూసే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు.

అందుకే టీవీ, కంప్యూటర్‌, మొబైల్‌.. తమకు అందుబాటులో ఉన్న మాధ్యమం ద్వారా మ్యాచ్‌లన వీక్షిస్తుంటారు. మరి, విమానంలో ప్రయాణించే వారి పరిస్థితి ఏంటి? ఈ సమస్యకు పరిష్కారంగా విమానయాన సంస్థలు మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. తాజాగా ఓ విమానంలో ఉన్న ప్రయాణికులందరూ స్క్రీన్‌లలో ఫుట్‌బాల్ మ్యాచ్‌ చూస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, ఈ మ్యాచ్‌ ఏ జట్ల మధ్య జరిగింది, అది ఏ విమానయాన సంస్థ అనే వివరాలను మాత్రం ప్రస్తావించలేదు.

ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 ప్రారంభమైనప్పటి నుంచి ఎతిహాద్‌, ఖతార్‌, జెట్‌ బ్లూ, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సహా మరికొన్నిఅంతర్జాతీయ విమానయాన సంస్థలు ఫుట్‌బాల్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. దీంతో ప్రయాణికులు గాల్లో కూడా తమకు ఇష్టమైన ఆటను ఆస్వాదిస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు '40 వేల అడుగుల ఎత్తులోనూ ఫుట్‌బాల్‌కు తగ్గని క్రేజ్‌', 'ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానించే ఆట ఇదే', 'గోల్ కొట్టినప్పుడు విమానంలో పరిస్థితి ఊహించడం కష్టం' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'పంత్​కు అందుకే ఛాన్సులు ఇస్తున్నాం... సంజూ వేచి చూడాల్సిందే'

Last Updated :Dec 1, 2022, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.