సత్తా చాటిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్.. వరల్డ్​ ర్యాంకింగ్స్​లో టాప్​

author img

By

Published : Sep 13, 2022, 8:49 PM IST

Updated : Sep 13, 2022, 9:24 PM IST

badminton world federation ranking

Badminton World Federation Rankings : బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్​లో భారత బ్యాడ్మింటన్‌ ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సత్తా చాటాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో టాప్​ ప్లేస్​కు చేరుకున్నాడు. మిగతా విభాగాల వారిగా ర్యాంకింగ్స్​ ఇలా ఉన్నాయి.

Badminton World Federation Rankings : భారత యువ బ్యాడ్మింటన్‌ ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ టాప్‌ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ తాజాగా విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్​లో 16వ స్థానంలో నిలిచాడు. వరల్డ్‌ టూర్‌ ర్యాంకింగ్స్‌లో (పురుషుల సింగిల్స్‌ విభాగం) ప్రణయ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. అంతకముందు 2017 అక్టోబర్ 27న 17 ర్యాంకులో ఉన్నాడు. ఈ సందర్భంగా భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ స్పందిస్తూ.. "జేయింట్ కిల్లర్​.. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత టాప్​ 15 ర్యాంకుల్లోకి వెళ్లబోతున్నాడు" అని ట్వీట్ చేసింది.

మరోవైపు మిక్స్​డ్​ డబుల్స్​లో ఇషాన్ భట్నాగర్, తనీషా క్రాస్టో జీవితకాలపు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. రెండు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంకులో స్థిరపడ్డారు. పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్ 12వ ర్యాంకును సాధించాడు. లక్ష్యసేన్​ ఇదే విభాగంలో 9వ స్థిరపడ్డాడు. గాయం కారణంగా ప్రపంచ ఛాంపియన్​ షిప్, జపాన్​ ఓపెన్​కు దూరమైన​ పీవీ సింధు ఒక ర్యాంకు ఎగబాకి 7వ స్థానంలో ఉంది. మరో ఒలింపిక్ విజేత సైనా నెహ్వాల్​ మూడు స్థానాలు మెరుగుపరచుకుని 33వ స్థానానికి చేరింది. పురుఘల డబుల్స్​ విభాగంలో కామన్​వెల్త్ గేమ్స్​లో గోల్డ్​ మెడల్ సాధించిన చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్​ 8వ స్థానంలో స్థిరపడ్డారు. మహిళల డబుల్స్​లో అశ్విని బోపన్న, ఎన్​ నిక్కిరెడ్డి 28వ స్థానంలో ఉన్నారు.

ఈ ఏడాది జనవరి 11న ప్రారంభమైన ఐదో సీజన్ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌.. డిసెంబర్ 18వ వరకు కొనసాగనుంది. వరల్డ్ టూర్‌ను ఐదు విభాగాలు విభజించి బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తోంది. సూపర్‌ -300, సూపర్‌ -500, సూపర్‌-750, సూపర్‌-1000, వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్ ఉంటాయి. ప్రతి లెవల్‌లో విజేతలకు వేర్వేరుగా ప్రైజ్‌మనీ ఉంటుంది.

ఇవీ చదవండి: స్మృతి కీలక నిర్ణయం.. బిగ్​బాష్​ లీగ్​కు దూరం

పాక్​బౌలర్​తో రిలేషన్​.. పంత్​కు క్షమాపణ చెప్పిన ఊర్వశి రౌతేలా

Last Updated :Sep 13, 2022, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.