Wrestling Protest: మేరీ కోమ్​ నేతృత్వంలో కొత్త కమిటీ ఏర్పాటు.. WFI అధ్యక్షుడిపై విచారణకు..

author img

By

Published : Jan 23, 2023, 4:34 PM IST

Wrestling committee

రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీ పేర్లను కేంద్రం వెల్లడించింది. బాక్సర్ మేరీ కోమ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులను నియమించింది. విచారణ పూర్తయ్యే వరకు డబ్ల్యూఎఫ్​ఐ రోజువారీ కార్యకలాపాలను కూడా ఈ కమిటీనే పర్యవేక్షించనుంది.

సంచలనం సృష్టించిన రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీ పేర్లను కేంద్రం వెల్లడించింది. బాక్సర్ మేరీ కోమ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల పర్యవేక్షణ కమిటీలోని పేర్లను తెలిపింది. లైంగిక దాడి ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య-డబ్ల్యూఎఫ్​ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్, ఇత‌ర కోచ్‌ల‌ను ఈ క‌మిటీ విచారించ‌నుంది.

దీంతో పాటు వచ్చే నెలకు సంబంధించి డబ్ల్యూఎఫ్​ఐ రోజువారీ కార్యకలాపాలను కూడా ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ఒలింపిక్‌ మెడల్ విజేత యోగేశ్వర్‌ దత్, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తృప్తి ముర్గుండే, స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ రాధికా శ్రీమన్ టార్గెట్ ఒలింపిక్‌ పోడియమ్‌ స్కీమ్‌ మాజీ సీఈఓ రాజగోపాలన్‌లు ఈ కమిటీలో మిగిలిన సభ్యులుగా ఉన్నారు.

డబ్ల్యూఐఎఫ్​ అధ్యక్షుడు, భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌.. మ‌హిళా రెజ్లర్లను లైంగికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నారని దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద రెజ్లర్లు 3 రోజులు ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో దిగివచ్చిన కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, రవి దహియాలతో చర్చలు జరిపి కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: ఫుట్​బాల్​ చరిత్రలోనే తొలిసారి అలా.. ఫ్యాన్స్​ షాక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.