ఫిఫా వరల్డ్​కప్​.. కేరళలో ఫ్యాన్స్​ ఫైట్​.. ఇనుప రాడ్లతో తలలు పగిలేలా..

author img

By

Published : Nov 22, 2022, 3:27 PM IST

kerala fifa worldcup fans fight

ఫిఫా ప్రపంచకప్ ప్రారంభమైన నేపథ్యంలో కేరళలోని ఫుట్​బాల్​ అభిమానులు ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో ఇరు జట్ల అభిమానులు మధ్య పెద్ద గొడవ జరిగింది. అది కాస్త తీవ్రంగా కొట్టుకునే స్థాయికి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది.

ఖతార్ వేదికగా ఫిఫా ప్రపంచకప్ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఊహించిన దాని కంటే భారీ స్థాయిలో అక్కడికి అభిమానులు పోటెత్తారు. అయితే ఈ ఫుట్​బాల్​కు భారత్​లో అంతగా ఆదరణ లేకపోయినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం విపరీతంగా అభిమానులు ఉంటారు. ముఖ్యంగా కేరళలో భారీగా ఫ్యాన్స్​ ఉన్నారు. అయితే ఈ ప్రపంచకప్​ మేనియా కేరళను ఊపేస్తోంది. ఆ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రొనాల్డో(పోర్చుగీస్​) నిలువెత్తు కటౌట్లు, మెస్సీ(అర్జెంటీనా) ఫ్లెక్సీలు.. నెయ్‌మార్‌(బ్రెజిల్​) బ్యానర్లు.. ప్రపంచకప్ ట్రోఫీలు దర్శనమిస్తున్నాయి. అభిమాన ఆటగాళ్ల జెర్సీలు ధరించి.. ఫుట్‌బాల్‌ఫై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు.

ఈ క్రమంలోనే కేరళ కొల్లాం జిల్లాలోని సక్తికులంగర గ్రామంలో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ర్యాలీలు చేశారు. ఈ గ్రామంలో పలువురు బ్రెజిల్​ జట్టుకు అభిమానులు కాగా.. మరి కొందరు అర్జెంటీనాకు ఫ్యాన్స్​. ఈ ర్యాలీలో ప్రపంచకప్ బ్రెజిలే గెలుస్తుందని కొందరు.. అర్జెంటీనానే కప్‌ గెలుస్తుందని మరికొందరు నినాదాలు చేసూ ర్యాలీ నిర్వహించారు. అయితే ఇది కాస్త వివాదానికి దారి తీసింది. ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ తీవ్రంగా కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ర్యాలీకి వచ్చిన వారంతా తమకు అందుబాటులో ఉన్న కర్రలు, పైపులు, ఇనుప రాడ్లు అందుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్​గా మారింది. ఈ వీడియో చూసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గొడవకు కారణమైన వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: టీ20 ప్రపంచకప్ ఫార్మాట్​లో​ భారీ మార్పులు.. పోటీలో 20 జట్లు.. క్వాలిఫైయర్ మ్యాచ్‌లకు గుడ్‌బై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.