Commonwealth games: 'మా విజయం.. వారిలో మరింత విశ్వాసాన్ని నింపుతుంది'

author img

By

Published : Aug 3, 2022, 3:06 PM IST

.

Commonwealth Games Table tennis: కామన్వెల్త్​ క్రీడల్లో స్వర్ణం సాధించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు భారత ప్లేయర్​ సత్యన్‌. తన ఆనందాన్ని వ్యక్త పరచడానికి మాటలు రావట్లేదని చెప్పాడు. ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన అతడు మరిన్ని విషయాలను పంచుకున్నాడు.

సత్యన్​

Commonwealth Games Table tennis: కామన్వెల్త్‌ క్రీడల్లో పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత బృందం స్వర్ణం సాధించింది. హర్మీత్‌- సత్యన్‌ జంట సింగపూర్​కు చెందిన యాంగ్‌ క్వీక్‌- యీ పాంగ్‌పై 3-1 తేడాతో గెలిచారు. దీంతో ఈ టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో మూడోసారి స్వర్ణం కైవసం చేసుకున్నట్టైంది. అయితే ఈ విజయంపై ఈ ఇద్దరు ప్లేయర్స్​ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆన్​లైన్​లో ఈటీవీ భారత్​కు సత్యన్​ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన సంతోషాన్ని మాటల్లో చెప్పలేనని అంటూ ఉబ్బితబ్బిబైపోయాడు.

"ఈ గెలుపు చెప్పలేనంత సంతోషానిచ్చింది. టైటిల్‌ను దక్కించుకోవడం ఎంతో మధురమైన విషయం. ఇది భారీ విజయం. ఆధిపత్య పోరులో నైజీరియాపై, ఆ తర్వాత సింగపూర్​పై విజయం సాధించడం అద్భుతం. ఇవి మనందరికీ ఎంతో మధురమైన క్షణాలు. ముఖ్యంగా టేబుల్​ టెన్నిస్​కు ​కామన్వెల్త్​ గేమ్స్ ఎంతో ప్రత్యేకం. విజయానికి సోపానం. మనం కామన్వెల్త్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాం. బలంగా నిలబడటం చాలా ముఖ్యం. మొత్తంగా ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో రెండో సారి స్వర్ణం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం మొత్తం టేబుల్​ టెన్నిస్​ ప్లేయర్స్​లో ఎంతో విశ్వాసాన్ని నింపింది. భవిష్యత్​లో ఈ క్రీడల్లో రావాలనుకునేవారికి స్ఫూర్తిగా నిలుస్తూ ఓ భారీ బెంచ్​మార్క్​ను సెట్​ చేసింది. ప్రపంచవేదికపై మా ప్రదర్శన చూసి యంగ్​స్టర్స్ మరింత మంచి ప్రదర్శన చేసేందుకు స్ఫూర్తి పొందుతారు" అని అన్నాడు.

ఇదీ చూడండి: Commonwealth games: లాన్‌ బౌల్స్‌ ఆట ఎలా ఆడతారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.