డోపింగ్​కు​ పాల్పడినా జాతీయ అవార్డులకు అర్హులే!

author img

By

Published : Sep 8, 2021, 6:00 PM IST

Dope violators eligible for national sports honours if ban period served: sports ministry

డోపింగ్​ నిషేధాన్ని పూర్తి చేసుకున్న అథ్లెట్లు (Doping Athletes) కూడా ఈసారి జాతీయ క్రీడా అవార్డులకు(National Sports Awards) అర్హులని క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పురస్కార వేడుక లోపు నిషేధాన్ని పూర్తి చేసుకోని క్రీడాకారులు అందుకు అర్హులు కారని తెలిపింది. నిషేధ సమయంలో అథ్లెట్లు ఎలాంటి పతకాలను సాధించినా.. పరిగణలోకి తీసుకోమని క్రీడా మంత్రిత్వ శాఖ(Sports Ministry) స్పష్టం చేసింది.

డోపింగ్​లో పట్టుబడిన అథ్లెట్లు కూడా(Doping Athletes) జాతీయ అవార్డులకు అర్హులేనని క్రీడా మంత్రిత్వ శాఖ(Sports Ministry) బుధవారం ఓ ప్రకటనలో తెలియజేసింది. నిషేధాన్ని పూర్తి చేసుకున్న క్రీడాకారులను పురస్కారాల(National Sports Awards) కోసం పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. అయితే నిషేధం కొనసాగుతున్న సమయంలో సదరు క్రీడాకారులు దేశం కోసం ఎలాంటి పతకాన్ని సాధించినా.. వాటిని పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల బాక్సర్​ అమిత్​ పంగాల్​తో పాటు మరికొంత మందికి లబ్ధి చేకూరనుంది.

గతేడాది వరకు డోపింగ్​కు పాల్పడిన అథ్లెట్లు, దానికి సహకరించిన కోచ్​లను జాతీయ అవార్డుల కోసం పరిగణలోకి తీసుకోలేదు. కానీ, ఈ ఏడాది నుంచి నిషేధాన్ని పూర్తి చేసుకున్న క్రీడాకారులు, కోచ్​లను పురస్కారాల కోసం పరిగణలోకి తీసుకుంటామని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించడం విశేషం.

అమిత్​ పంగాల్​కు ఊరట

ఆసియన్​ గేమ్స్​ గోల్డ్​ విన్నర్​, బాక్సింగ్​ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో భారత్​కు తొలి రజత పతకాన్ని సాధించిన బాక్సర్​ అమిత్​ పంగాల్​.. ఇప్పటికే రెండు సార్లు అర్జున అవార్డుకు నామినేట్​ అయ్యాడు. అయితే 2012లో చికెన్​ పాక్స్​ కారణంగా అతడు తీసుకున్న మందులలో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్న కారణంగా జ్యూరీ అతడిని పరిగణలోకి తీసుకోలేదు. అతడికి తెలియని ఓ నిషేధిక ఔషధాన్ని తీసుకున్న కారణంగా అమిత్​ పంగాల్​పై వేటు పడింది. అమిత్​.. గతేడాది ఖేల్​రత్న అవార్డుకు నామినేట్​ అయ్యాడు.

పురస్కార వేడుక వాయిదా..

ధ్యాన్​చంద్​ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న జాతీయ క్రీడా పురస్కారాల వేడుకను(National Sports Awards 2021) నిర్వహించాల్సింది. అయితే అప్పటికే టోక్యో పారాలింపిక్స్​ పూర్తి కాని నేపథ్యంలో వాటిని వాయిదా వేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇటీవలే పారాలింపిక్స్​(Tokyo Paralympics) పూర్తయిన సందర్భంగా ఈ ప్రదానోత్సవాన్ని నిర్వహించే తేదీ అతి త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇదీ చూడండి.. Pramod Bhagat: గోల్డ్​ గెలిచిన పారా అథ్లెట్​కు భారీ నజరానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.