మహిళల ప్రీమియర్ లీగ్ తేదీలు అవేనా!.. ఐపీఎల్-15 సీజన్‌ ఫైనల్‌ అప్పుడేనా?

author img

By

Published : Jan 26, 2023, 7:15 AM IST

women premier league set to be played from march 4 to 24

మహిళల ఐపీఎల్(డబ్ల్యూపీఎల్)​కు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్​ను మార్చి 4 నుంచి 24 మధ్య నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (మహిళల ఐపీఎల్) నిర్వహణకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్‌ని మార్చి 4-24 మధ్య నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్‌-15 సీజన్‌ను మార్చి 31 లేదా ఏప్రిల్ 1న ప్రారంభించి మే 28న ఫైనల్‌ నిర్వహించే అవకాశం ఉంది. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫిబ్రవరి మొదటివారంలో మహిళల ఐపీఎల్​కు సంబంధించిన ఆటగాళ్ల వేలం నిర్వహించే అవకాశం ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఒక్కో జట్టు రూ.12 కోట్లు వెచ్చించాలి. ప్రతి జట్టు 15-18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు.

మహిళల ఐపీఎల్​లో పాల్గొనే ఐదు జట్ల కోసం నిర్వహించిన వేలం వివరాలను బీసీసీఐ బుధవారం మధ్యాహ్నం వెల్లడించింది. ఐదు జట్ల ద్వారా రూ. 4670 కోట్ల భారీ మొత్తం సమకూరినట్లు పేర్కొంది. అహ్మదాబాద్‌ జట్టును అదానీ స్పోర్ట్స్‌లైన్ రూ.1,289 కోట్లకు, ముంబయి జట్టును ఇండియావిన్‌ స్పోర్ట్స్‌ రూ.913 కోట్లకు, బెంగళూరు జట్టును రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ రూ.901 కోట్లకు, దిల్లీ జట్టును జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్‌ క్రికెట్ రూ.810 కోట్లకు‌, లఖ్‌నవూ జట్టును కాప్రీ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ రూ.757 కోట్లకు దక్కించుకున్నట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.