ఫీల్డింగ్​ చేస్తూ స్నాక్స్ తింటున్న కోహ్లీ.. వీడియో వైరల్​...!

author img

By

Published : Mar 10, 2023, 8:09 AM IST

virat kohli

స్టార్​ క్రికెటర్​ విరాట్​ కోహ్లీ మైదానంలో తన ఆటతో పాటు చిలిపి పనులు చేస్తూ కెమెరాకు దొరకడం కామన్​. కొన్ని సార్లు తను చేసిన పనులకు నెట్టింట ట్రోల్స్​ అవుతుంటే మరికొన్ని సార్లు అవే పనులు అభిమానులను కడుపుబ్బా నవ్వేలా చేస్తాయి. ఈ క్రమంలో గురువారం జరిగిన ఇండియా ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్​ మ్యాచ్​లో విరాట్​ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరలవుతుంది. అదేంటంటే..

అహ్మదాబాద్​ వేదికగా గురువారం ప్రారంభమైన భారత్​ ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్​ సిరీస్​ ఎంతో ఉత్కంఠంగా సాగింది. ఓ వైపు టాస్​ గెలుచుకుని ఆసిస్​ టీమ్​ బరిలోకి దిగి చిత్తు రేపుతున్న వేళ అంతే ఎనర్జీతో మన బౌలర్లు కూడా ఏ మాత్రం తగ్గకుండా వారిని ఔట్​ చేస్తూ వచ్చారు. ప్రత్యర్ధులు తమ ఎత్తుగడలను ప్రదర్శిస్తుంటే.. టీమ్​ ఇండియా బౌలర్లు దానికి పై ఎత్తులు వేస్తూ వచ్చారు. అయినప్పటికీ కంగారు జట్లు టీమ్ ఇండియాను కంగారు పెట్టించడం ఆపలేదు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో పలు హైలైట్​ పాయింట్స్​తో పాటు మీమ్స్​ కూడా తెగ ట్రెండ్​ అవుతోంది. అలా మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ చేసిన ఓ పని ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

సెకెండ్​ స్లిప్​లో టీమ్​ ఇండియా తరఫున విరాట్​ కోహ్లీ ఫీల్డింగ్​ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్కస్ లబుషేన్ స్ట్రైక్ తీసుకుంటున్న సమయంలో విరాట్​.. తన వద్దనున్న ఎనర్జీ బార్​ను ఆస్వాదిస్తూ కనిపించాడు. అయితే ఇది చూసి పక్కనే థర్డ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్ అతనికి కొంచం ఇవ్వమని అడిగాడు. దీంతో కాసేపు తర్వాత తన పాకెట్​లో ఉన్న ఆ చాక్లెట్​ను బయటికి తీసిన కోహ్లీ.. శ్రేయాస్ అయ్యర్‌కి విసిరాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అయితే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఆట తీరు అందరిని నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో కోహ్లీ స్కోర్​ 12, 44, 20, 22, 13 పరుగులు మాత్రమే. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కోహ్లీ మళ్లీ ఫామ్​లోకి రావాలని ఆశిస్తున్నారు.

ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్​ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్​ సిరీస్​లో ఆసిస్​ ప్లేయర్లు చెలరేగిపోయారు. ఓపెనర్​గా దిగిన ఉస్మాన్ ఖవాజా అయితే ఏకంగా శతకం బాది మన బౌలర్లకు చెమటలు పట్టించాడు. అతనితో పాటు ఆడిన కామెరూన్ గ్రీన్ కూడా మైదానంలో చెలరేగిపోయాడు. కంగారు టీమ్​లోని మిగతా బ్యాటర్లైన స్టీవెన్ స్మిత్, పీటర్స్ హాండ్స్‌కోంబ్ కూడా తమ ఆట తీరుతో ఫర్వాలేదనిపించారు. దీంతో ఫస్ట్​ డే మ్యాచ్​ ముగిసే సమయానికి ఆ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఇక టీమ్​ ఇండియా బౌలర్​ షమీ రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, అశ్విన్​ మాత్రం చెరో వికెట్ తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.