అయ్యో.. జోరూట్‌లా ప్రయత్నించి విఫలమైన కోహ్లీ.. వీడియో వైరల్

అయ్యో.. జోరూట్‌లా ప్రయత్నించి విఫలమైన కోహ్లీ.. వీడియో వైరల్
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌ను ఓ విషయంలో అనుసరించబోయాడు టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. అయితే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్ మాజీ సారథి జోరూట్‌ను అనుసరించి విఫలమయ్యాడు. ఇదేదో బ్యాటింగ్‌లో షాట్ గురించి అనుకుంటే పొరపడినట్లే. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో రూట్ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో నిలుచున్న సందర్భంగా తన బ్యాట్‌ను ఎలాంటి సపోర్ట్ లేకుండానే కాసేపు పిచ్‌పై నిటారుగా నిలబెట్టి మ్యాజిక్ చేశాడు. ఆ వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
అయితే, తాజాగా కోహ్లీ కూడా ఆ ట్రిక్ చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యాడు. లీసెస్టర్‌లో నిన్న ప్రారంభమైన వార్మప్ మ్యాచ్‌లో రూట్ మాదిరే పిచ్‌పై తన బ్యాట్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ రెండు మూడుసార్లు ప్రయత్నించినా అది కుదరలేదు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. రూట్‌ను చూసి కోహ్లీ ప్రయత్నించాడని నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఆ వీడియో చూసేయండి.
-
After Joe roots magic which was seen on the pitch by balancing the bat @imVkohli trying the same 😂 pic.twitter.com/TUZpAUJSA1
— Yashwanth (@bittuyash18) June 23, 2022
-
I knew @root66 was talented but not as magic as this……. What is this sorcery? @SkyCricket #ENGvNZ 🏏 pic.twitter.com/yXdhlb1VcF
— Ben Joseph (@Ben_Howitt) June 5, 2022
ఇదీ చూడండి: 'పెద్ద ఆటగాడు చాలా కాలంగా సెంచరీ చేయకపోవడం బాధాకరం'
