నేను ఫిట్​, సిరాజ్​ కోలుకోలేదు: మూడో టెస్టుపై కోహ్లీ

author img

By

Published : Jan 10, 2022, 4:08 PM IST

Virat Kohli news, Virat Kohli SA 3rd tes, విరాట్ కోహ్లీ లేటెస్ట్ న్యూస్, విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా

Virat Kohli SA Test: భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టు మంగళవారం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. తాను పూర్తి ఫిట్​నెస్​తో ఉన్నానని తెలిపాడు.

Virat Kohli SA Test: దక్షిణాఫ్రికాతో మంగళవారం నుంచి జరగబోయే మూడో టెస్టుకు సిద్ధమైంది టీమ్ఇండియా. ఈ మ్యాచ్​లో ఎలాగైనా గెలిచి సిరీస్​ను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. తద్వారా సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్​ గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు ఆటగాళ్లు. గాయంతో రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్​కు ఫిట్​నెస్ సాధించాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్​కు ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. తాను పూర్తి ఫిట్​గా ఉన్నట్లు తెలిపాడు.

"నేను పూర్తి ఫిట్​గా ఉన్నా. సిరాజ్​ పూర్తి ఫిట్​నెస్ సాధించలేదు. సిరాజ్ విషయంలో రిస్క్ తీసుకోలేం. అందుకే అతడు మూడో టెస్టుకు అందుబాటులో ఉండట్లేదు. సిరాజ్ స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకోవాలన్న విషయమై నేను, కోచ్, వైస్ కెప్టెన్​ చర్చించి నిర్ణయం తీసుకుంటాం. బెంచ్ స్ట్రెంత్ కూడా బలంగా ఉంది. అందువల్ల మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మాకు గర్వకారణం."

-విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్

జోహెనస్​బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ వీరోచిత పోరాటంతో మ్యాచ్​ను వారి వైపు తిప్పుకొన్నాడు. దీంతో భారత్ ఒత్తిడిలో పడిపోయింది. మూడో మ్యాచ్ జరగబోయే కేప్​టౌన్​లో టీమ్ఇండియాకు గొప్ప రికార్డేమీ లేదు. దీంతో గెలుపు కోసం కోహ్లీసేన తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. ఈ మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇవీ చూడండి: 'గార్డ్ ఆఫ్ ఆనర్'తో టేలర్​కు వీడ్కోలు.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.