ఐపీఎల్‌కు కొత్త టైటిల్ స్పాన్సర్.. వివో స్థానంలో టాటా
Updated on: Jan 11, 2022, 3:48 PM IST

ఐపీఎల్‌కు కొత్త టైటిల్ స్పాన్సర్.. వివో స్థానంలో టాటా
Updated on: Jan 11, 2022, 3:48 PM IST
IPL Title Sponsor: ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ షిప్‌ను టాటా గ్రూపునకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది బీసీసీఐ. వివో ఈ కాంట్రాక్టు నుంచి తప్పుకొనేందుకు అంగీకరించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.
IPL Title Sponsor: దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన టాటా గ్రూప్.. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ కొత్త స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఇప్పటివరకు టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న చైనా మొబైల్ తయారీ సంస్థ 'వీవో' వైదొలగనుంది. ఈ మేరకు ఐపీఎల్ కమిటీ నిర్ణయించినట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు.
2018 ఐపీఎల్ సీజన్ నుంచి 2022 సీజన్ వరకు స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు వీవో.. రూ. 2,200 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. 2020లో గల్వాన్ లోయలో.. భారత్, చైనా సైన్యం మధ్య ఘర్ఘణల నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి 'వివో' వైదొలగగా డ్రీమ్-ఎలెవన్‌కు హక్కులు దక్కాయి. అయితే.. 2021 ఐపీఎల్ సీజన్‌కు మాత్రం తిరిగి 'వివో' స్పాన్సర్‌గా వ్యవహరించింది.
ఇదీ చదవండి:
ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ రేసులో ఐదు సంస్థలు!
ఐపీఎల్ 2020: వివోతో బీసీసీఐ ఒప్పందం రద్దు
