Rohith: ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్​గా రికార్డ్​​.. గాయంతోనే ఆడి..

author img

By

Published : Oct 3, 2022, 9:51 AM IST

rohith sharma record

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. అయినా పెయిన్​ కిల్లర్స్​ వేసుకుని అలానే ఆడాడు. ప్రస్తుతం అతడి గాయం తీవ్రతపై స్పష్టత లేదు. ఇక మ్యాచ్​ అయిపోయాక డెత్ ఓవర్ల సమస్యతో పాటు పలు విషయాల గురించి మాట్లాడాడు. ఈ మ్యాచ్​తో ఓ సూపర్​ రికార్డును కూడా సాధించాడు. ఏమన్నాడంటే..

టీ20 ప్రపంచకప్ ముందు టీమ్​ఇండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే గాయాలతో స్టార్ పేసర్ బుమ్రా, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా జట్టుకు దూరమయ్యారు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం గాయపడ్డాడు. అయితే అతడి గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది. పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఆటను కొనసాగించిన హిట్​మ్యాన్​.. కాస్త అసౌకర్యంగానే కనిపించాడు. దాంతో అభిమానులు ఆందోళనకు గురౌతున్నారు.

కాగా, రోహిత్​.. రెండో టీ20 మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో అంతగా పాల్గొనలేదు. ఏమైనా ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడా? అనే ప్రచారం సాగింది. కానీ ఈ మ్యాచ్​లో బరిలోకి దిగడం వల్ల అతడు ఫిట్‌గానే ఉన్నాడని అంతా అనుకున్నారు. కానీ ఇన్నింగ్స్ ఆరంభంలో పార్నెల్ వేసిన రెండో ఓవర్‌లో రోహిత్ మణికట్టుకు గాయమైంది. అతడు వేసిన ఈ ఓవర్ మూడో బంతిని హిట్​మ్యాన్​ స్కూప్ షాట్‌తో బౌండరీకి తరలించాడు. అయితే ఈ షాట్ ఆడే క్రమంలో బంతి అతని గ్లౌవ్స్ తాకి కీపర్‌ పక్క నుంచి బౌండరీకి వెళ్లింది. అయితే రోహిత్ నొప్పితో విలవిలలాడాడు. అతని ఎడమ మణికట్టుకు బంతి బలంగా తాకినట్లు కెమెరాలో కనిపించింది. వెంటనే మైదానంలోకి వచ్చిన ఫిజియో.. ప్రథమ చికిత్స చేయడం వల్ల హిట్​మ్యాన్​ తన ఆటను కొనసాగించాడు. అయితే ఆ దెబ్బ తీవ్రత ఎక్కువ కాకూడదని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా విధ్వంసం సృష్టించింది. సఫారీలపై ఘన విజయం సాధించింది. భారత్​ బ్యాటర్ల ధాటికి సఫారీ బౌలర్లు చతికిలపడ్డారు.

డెత్​ ఓవర్లపై రోహిత్​.. ఈ రెండో మ్యాచ్​ గురించి మాట్లాడుతూ.. ''బ్యాటింగ్‌ విషయంలో ఒకటి చెప్పాలనుకుంటున్నా. గత 8-10 నెలల నుంచి మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఒకే విధంగా సాగుతుంది. ఇక బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా బ్యాటర్లు తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. ఇప్పటివరకు చూసుకుంటే బ్యాటింగ్‌లో అంతా పాజిటివ్‌గానే ఉంది. ఓపెనర్లుగా నేను, కేఎల్‌ రాహుల్‌, వన్‌డౌన్‌లో కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ వరకు ఎలాంటి మార్పులు ఉండవు. రానున్న టి20 ప్రపంచకప్‌లో టాప్‌-4 బాగా రాణిస్తుందని అనుకుంటున్నా. ఇక ఐదో స్థానం నుంచి ఏడో స్థానం వరకు పరిస్థితులను బట్టి బ్యాటర్లు మారుతుంటారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో మా ప్రదర్శన బాగుంది. ఈరోజు పూర్తిస్థాయిలో బ్యాటింగ్‌ చేశామనిపించింది. అయితే గత ఐదారు మ్యాచ్‌లుగా చూసుకుంటే డెత్‌ ఓవర్లలో మా బౌలింగ్‌ దారుణంగా ఉంటుంది. దానిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇవాళ్టి మ్యాచ్‌లో మా బౌలింగ్‌ బాగాలేదు. ఆరంభంలో దీపక్‌ చహర్‌, అర్షదీప్‌లు మంచి ఆరంభం ఇచ్చినప్పటికి మధ్య, డెత్‌ ఓవర్లలో దానిని కాపాడుకోలేకపోయాం. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో మాకు బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేయడం కష్టమవుతోంది. దీనిని అధిగమించాల్సి ఉంది. ఇక సూపర్‌ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ను నేరుగా అక్టోబర్‌ 23న ఆడించాలనుకుంటున్నాం. సూర్య తనేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇక అతన్ని కాపాడుకోవడం మా బాధ్యత. అందుకే అతడికి రెస్ట్‌ ఇవ్వడం కరెక్టని నా అభిప్రాయం. ఇక సూర్య క్రీజులో కనిపించేది అక్టోబర్‌ 23నే. ఇక మూడో టి20కి జట్టులో మార్పులుంటాయి'' అని పేర్కొన్నాడు.

సూపర్​ రికార్డ్​: కెప్టెన్ రోహిత్​ శర్మ ఈ మ్యాచ్​తో అదిరిపోయే రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశీ గడ్డపై టీ20 సిరీస్​లో దక్షిణాఫ్రికాను ఓడించిన తొలి కెప్టెన్​గా నిలిచాడు.

ఇదీ చూడండి: National games: జాతీయ క్రీడల్లో రష్మీకి రజతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.