అప్పుడు రోహిత్​.. ఇప్పుడు రవిబిష్ణోయ్​.. సవాల్​ విసిరారుగా!

author img

By

Published : Sep 20, 2022, 4:01 PM IST

ravibishnoi rohith sharma

టీమ్​ఇండియా మేనేజ్​మెంట్​పై స్పిన్నర్​ రవిబిష్ణోయ్​ చేసిన ఓ పోస్ట్​ ప్రస్తుతం వైరల్​గా మారింది! గతంలో ఇదే పోస్ట్​ను కెప్టెన్​ రోహిత్​ కూడా చేశాడు. ఇంతకీ అదేంటంటే..

స్పిన్నర్​ రవిబిష్ణోయ్​ టీమ్​ఇండియా మేనేజ్​మెంట్​పై అసహనం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచ కప్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లకు తనను ఎంపిక చేయకపోవడంపై తన బాధను వ్యక్తం చేశాడు. త్వరలోనే తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. 'సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు.. మేం మళ్లీ ప్రయత్నిస్తాం' అని ఇన్​స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్​గా మారింది. అయితే ఇది వైరల్​ అవ్వడానికి మరో కారణం కూడా ఉంది.

ఎందుకంటే గతంలో కెప్టెన్​ రోహిత్ శర్మ కూడా ఇలాంటి పోస్ట్​ పెట్టాడు. 2018లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో హిట్​మ్యాన్​కు స్థానం దక్కలేదు. దీంతో 'సూర్యుడు రేపు మళ్లీ ఉదయిస్తాడు' అంటూ ట్వీట్ చేశాడు. అలానే ఆ తర్వాత కసితో ఆడిన అతడు మూడు ఫార్మాట్లలోనూ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోవడంతో పాటు.. ఐపీఎల్‌లో సక్సెస్​ఫుల్​గా కెప్టెన్​గా ఎదిగాడు. అలానే మూడు ఫార్మాట్లలో టీమ్​ఇండియా కెప్టెన్​గా అవతరించాడు. దీంతో రోహిత్‌ లానే రవి బిష్ణోయ్ కూడా భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా రవి బిష్ణోయ్ టీమ్​ఇండియాలోకి అడుగుపెట్టాడు.ఆసియా కప్ కన్నా ముందు ఆగస్టులో వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 8 వికెట్లు తీశాడు. చివరి టీ20లో 4 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో ఆసియా కప్‌ కోసం అతడిని ఎంపిక చేశారు. కానీ సూపర్ 4 దశలో పాకిస్థాన్‌పై మాత్రమే అతడికి ఆడే అవకాశం లభించింది. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రెండు బంతులు మాత్రమే ఆడిన బిష్ణోయ్ రెండు ఫోర్లు బాది 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం 4 ఓవర్లు బౌలింగ్ చేసి 26 పరుగులిచ్చిన బిష్ణోయ్.. కీలకమైన బాబర్ ఆజమ్ వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత శ్రీలంక, అప్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో బిష్ణోయ్‌కు ఆడే అవకాశం రాలేదు. టీమ్​ఇండియా మేనేజ్‌మెంట్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌ల వైపు మొగ్గు చూపడం వల్ల ప్రపంచకప్​తో పాటు సహా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్​లలో చోటు దక్కలేదు.

ఇదీ చూడండి: క్రికెట్​ రూల్స్​ మార్చిన ఐసీసీ.. ఇక నుంచి మ్యాచ్​లో అవన్నీ బంద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.