మైనర్ రేప్​ కేసు.. పోలీసుల ముందు లొంగిపోతానన్న స్టార్ క్రికెటర్!

author img

By

Published : Oct 1, 2022, 8:29 PM IST

nepal cricketer minor rape case

అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్​​ సందీప్​ లమిచ్చానే కీలక ప్రకటన చేశాడు. స్వయంగా తానే పోలీసుల ముందు హాజరవుతానని పేర్కొన్నాడు.

అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపాల్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్​​ సందీప్​ లమిచ్చానే.. స్వయంగా తానే పోలీసుల ముందు లొంగిపోతానని ప్రకటించాడు. అక్టోబర్​ 6న తన స్వదేశానికి వచ్చి అధికారుల ముందు హాజరవుతానని చెప్పాడు. విచారణకు సహకరిస్తానని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సోషల్​మీడియాలో తెలిపాడు. ఇంటర్​పోల్​ అతడి ఆచూకీ కోసం డిఫ్యూజన్​ నోటీసు జారీ చేసిన అనంతరం అతడు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.

ఇదీ జరిగింది: తనను సందీప్​.. ఆగస్టు 21 కాఠ్ మాండూ, భక్తపూర్​లోని పలు ప్రాంతాల్లో తిప్పి.. అదే రోజు రాత్రి కాఠ్​ మాండు సినమంగల్​లోని ఓ హోటల్​కు తీసుకొచ్చి అక్కడే అత్యాచారం చేసినట్లు నేపాల్​కు చెందిన ఓ 17ఏళ్ల మైనర్​ బాలిక ఆరోపించింది. అతడిపై అక్కడి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు.. అతడి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. నేపాల్​ కోర్టు కూడా అరెస్ట్ వారెంట్​ జారీ చేసింది. ఈ విషయం తెలియడంతో నేపాల్ క్రికెట్​ బోర్డు అతడిపై వేటు వేసింది. జట్టు నుంచి తప్పించింది. కాగా, అప్పటికే అతడు కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌) ఆడేందుకు జమైకా వెళ్లాడు. అయితే టోర్నీ నిర్వాహకులకు సమాచారం అందడంతో అతన్ని జట్టు నుంచి తొలగించారు. అయితే అప్పటినుంచి స్వదేశానికి రాకుండా అక్కడే ఉండిపోయాడు. దీంతో నేపాల్‌ పోలీసులు సందీప్​ను అరెస్ట్​ చేసేందుకు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. దీంతో ఇంటర్​పోల్​ డిప్యూజన్​ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన అతడు.. తాను ఏ తప్పు చేయలేదని.. త్వరలోనే దేశానికి తిరిగి వచ్చి తనపై వచ్చిన ఆరోపణలు తప్పుడువని నిరూపించుకుంటానని' సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు తాజాగా మళ్లీ సామాజిక మాధ్యమాల వేదికగా అక్టోబర్ 6న స్వదేశానికి వచ్చి పోలీసుల ముందు హాజరవుతానని పేర్కొన్నాడు.

కాగా సందీప్‌ నేపాల్‌ జట్టు తరపున స్టార్‌ క్రికెటర్‌గా ఎదిగాడు. అక్కడి జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు 30 వన్డేల్లో 69 వికెట్లు, 44 టి20ల్లో 85 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో 2018 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించన అతడు 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చూడండి: టీ20 ప్రపంచకప్​ జట్టులో బుమ్రా.. ద్రవిడ్ ఏం అన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.