కేఎల్‌ రాహుల్‌.. ఇక్కడితో ఆగకూడదు.. WTC ఫైనల్​లో ఛాన్స్ కోసం అలా చేయాల్సిందే!

author img

By

Published : Mar 18, 2023, 3:49 PM IST

Updated : Mar 18, 2023, 4:33 PM IST

KL Rahul

ఫామ్‌ కోల్పోయి ఇంతకాలం ఇబ్బంది పడిన కేఎల్ రాహుల్​.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విజృంభించిన సంగతి తెలిసిందే. జట్టును విజయతీరాలకు చేర్చాడు. తనను విమర్శించిన వారికి బ్యాట్​తో గట్టి సమాధానమిచ్చాడు. అయితే అతడు ఈ ప్రదర్శనతో సంతృప్తి పడకూడదు. మిగతా రెండు వన్డేలతో పాటు త్వరలోనే జరగనున్న ఐపీఎల్​లోనూ బాగా రాణించాలి. అప్పుడే డబ్ల్యూటీసీ ఫైనల్​ జట్టులో అతడికి అవకాశం దక్కుతుంది!

ఫామ్‌లో లేడు.. టీమ్​లో అవసరమా.. ఎందుకు అతడికి ఇంకా ఛాన్స్​లు ఇస్తున్నారు.. సెలక్టర్లు ఎందుకు ఎంపిక చేస్తున్నారు.. అతడి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వండి.. ఇవన్నీ నిన్నటి వరకు టీమ్​ఇండియా బ్యాటర్​ కేఎల్ రాహుల్​పై సోషల్​మీడియా వేదికగా వచ్చిన విమర్శలు. అయితే కొంతకాలంగా ఇవన్నీ ఓర్పుగా భరించిన అతడు సరైన సమయం కోసం ఎదురు చూశాడు.. ఇప్పుడు రోహిత్‌, శ్రేయస్‌ గైర్హాజరీలో దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన బ్యాట్‌తో సత్తా చాటి తానేంటో నిరూపించాడు. బ్యాటింగ్‌తోనే కాకుండా కీపింగ్‌లోనూ మంచి ప్రదర్శన చేసి విమర్శకులకు చెక్​ పెట్టాడు. ఇప్పుడందరూ తనని ప్రశంసించేలా చేసుకున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఫెయిల్​ అవ్వడంతో మూడో టెస్టు నుంచి కేఎల్ రాహుల్‌ను జట్టు నుంచి తప్పించారు. చివరి మ్యాచ్​ను అతడికి చోటు ఇవ్వలేదు. దీంతో అతడికి వన్డే టీమ్​లోనైనా అవకాశం ఇస్తారా? లేదా? అని క్రికెట్ అభిమానులంతా భావించారు. అయితే సెలక్టర్లు అతడికి జట్టులో తిరిగి వచ్చేందుకు అవకాశం ఇచ్చారు. ఐదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు దిగాడు. ఇక తన సత్తా ఏంటో నిరూపించాడు. మిడిలార్డర్‌లో తన పాత్ర ఎంత ముఖ్యమైందో చాటి చెప్పాడు. కీలకమైన ఇన్నింగ్స్​ హాఫ్​ సెంచరీ 75 పరుగుల అజేయంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్​లో ఇషాన్‌ కిషన్​ ఉన్నప్పటికీ.. కేఎల్​ రాహుల్‌తోనే హార్దిక్ కీపింగ్‌ చేయించాడు. అందులోనూ రాహుల్​ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. స్మిత్‌ క్యాచ్‌ను వావ్​ అనేలా డైవ్‌ చేస్తూ పట్టుకున్నాడు. దీంతో స్మిత్​తో పాటు అభిమానులంతా ఆశ్చర్యపోయారు.

అదే కారణమా..? వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని గట్టి టీమ్​ను రెడీ చేస్తోంది బీసీసీఐ. ఇందులో భాగంగానే ప్రతి మ్యాచ్‌నూ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. దీంతో.. జట్టులో స్థానం దక్కించేందుకు సీనియర్​ ప్లేయర్లకు.. యువ ఆటగాల్లు గట్టి పోటినిస్తూ మంచి ప్రదర్శన చేస్తున్నారు. శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్.. ఇలా ఈ యంగ్ ప్లేయర్స్​ అవకాశాల కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. మరి వరల్డ్​ కప్​ జట్టులో చోటు దక్కాలంటే సీనియర్లు కూడా యంగ్ ప్లేయర్స్​తో పోటీ పడి మరీ ఆడాలి. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా ఇతర విభాగాల్లోనూ తమ టాలెంట్​ను చూపించాలి. లక్కీగా కేఎల్‌ రాహుల్‌కు కీపర్‌గానూ సత్తా చాటగల ప్రతిభ ఉంది. ఇప్పుడదే ప్రతిభ ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో తనను తాను నిరూపించుకోవడానికి రాహుల్‌కు బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా మిడి లార్డర్​లో రిషబ్ పంత్, శ్రేయస్‌ అయ్యర్‌ లేకపోవడం వల్ల ఈ సిరీస్‌లో రాహుల్‌కు అవకాశం దక్కింది. దానినే బాగా ఉపయోగించుకుని తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి రాహుల్​ బాగానే ప్రయత్నించాడు. మంచి ఇన్నింగ్స్​ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

వాటిని వినియోగించుకోవాలి.. అయితే తొలి వన్డేలో హాఫ్​ సెంచరీ చేసిన అతడు ఆ ప్రదర్శనతో సరిపెట్టుకోకూడదు. సంతృప్తి చెందకూడదు. ఎందుకంటే మిగిలిన రెండు వన్డేల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. అలాగే మార్చి 31 నుంచి మొదలు కానున్న ఐపీఎల్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేయాలి. అప్పుడే జూన్​లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్​ జట్టులో అతడికి అవకాశం దక్కుతుంది! అలాగే.. వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్‌, భారత్​లో జరిగే వన్డే ప్రపంచకప్‌.. వస్తున్న నేపథ్యంలో అతడు మరింత శ్రమించాలి.

ఇదీ చూడండి: రోహిత్ శర్మ రీఎంట్రీ.. ఇషాన్ కిషన్‌పై వేటు.. రెండో వన్డే ఆడే భారత జట్టు ఇదే!

Last Updated :Mar 18, 2023, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.