GT vs MI : శుభ్​మన్​ గిల్​ అన్​స్టాపబుల్​ సెంచరీ.. ముంబయి టార్గెట్​ ఎంతంటే?

author img

By

Published : May 26, 2023, 9:56 PM IST

Updated : May 26, 2023, 10:30 PM IST

Gujarat Titans vs Mumbai Indians Qualifier 2

IPL 2023 Qualifier 2 : ఐపీఎల్​ 16వ సీజన్ అంతిమ దశకు చేరుకుంది. ఫైనల్​కు వెళ్లేందుకు క్వాలిఫయర్​-2లో గుజరాత్​, ముంబయి మధ్య జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ బ్యాటర్​ శుభ్​మన్​ గిల్​ అన్​స్టాపబుల్​ ఇన్నింగ్స్​ ఆడాడు. సెంచరీ బాదాడు. ముంబయి టార్గెట్​ ఎంతంటే?

IPL 2023 Qualifier 2 : ఐపీఎల్​ 16వ సీజన్ అంతిమ దశకు చేరుకుంది. ఫైనల్​కు వెళ్లేందుకు క్వాలిఫయర్​-2లో గుజరాత్​, ముంబయి మధ్య జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ ఇన్నింగ్స్​ ముగిసింది. 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. ముంబయికి 234 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్​లో గుజరాత్​ ఓపెనర్​​ శుభ్​మన్​ గిల్​ (129) అన్​స్టాపబుల్​ ఇన్నింగ్స్​ ఆడాడు. 60 బంతుల్లో 10 సిక్స్​లు, 7 ఫోర్లతో శతక్కొట్టాడు. మరో ఓపెనర్​ వృద్ధిమాన్​ సహా (18) పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఇక మరో బ్యాటర్​ సాయిసుదర్శన్​ హాఫ్​ సెంచరీకి దగ్గర్లో రిటైర్ట్​ హర్ట్​ అయ్యాడు. హార్దిక్​ పాండ్య (28), రషీద్​ ఖాన్ (5) ఇక ముంబయి బౌలర్లలో ఆకాశ్​ మధ్వాల్​, పీయుశ్​ చావ్లా చెరో వికెట్ తీశారు.

గిల్​ అన్​స్టాపబుల్​ సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలో రికార్డు..
ప్రస్తుతం ఐపీఎల్​ సీజన్​లో గుజరాత్​ బ్యాటర్​ శుభ్​మన్ గిల్ విపరీత ఫామ్​లో ఉన్నాడు. ఈ సీజన్​లో ఇప్పటి వరకు 3 సెంచరీలతో దుమ్మురేపాడు. ఇలా ఒకే ఐపీఎల్​ సీజన్​లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ప్లేయర్​గా, తొలి పిన్న వయస్కుడిగా (23 ఏళ్ల 260 రోజులు) నిలిచాడు. ఇక నాలుగు సెంచరీలతో ఈ జాబితాలో బట్లర్​ (2022 సీజన్​), విరాట్ కోహ్లీ (2016)లో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.

ఇషాన్​కు గాయం..
శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీతో చెలరేగిన సమయంలోనే ముంబై కీపర్ ఇషాన్ కిషన్‌కు దెబ్బ తగిలింది. దీనికి కారణం ఎవరో కాదు.. ముంబై పేసర్ క్రిస్ జోర్డాన్. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేయడంలో జోర్డాన్ దారుణంగా విఫలమయ్యాడు. ముందుకు చూడకుండా వచ్చిన జోర్డాన్ ఇషాన్​కు ఢీకొట్టాడు. అతడి భుజం ఇషాన్​ కంటికి తగిలింది. నొప్పితో ఇషాన్​ కిషన్​ బాధపడ్డాడు. అనంతరం పెవిలియన్​కు వెళ్లిపోయాడు. దీంతో ముంబయి అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు : వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమి
ఇంపాక్ట్‌ ప్లేయర్లు : జాషువా లిటిల్‌, శ్రీకర్ భరత్, ఓడియన్‌ స్మిత్, రవిశ్రీనివాసన్‌ సాయి కిశోర్‌, శివమ్‌ మావి

ముంబయి ఇండియన్స్ తుది జట్టు : ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), రోహిత్ శర్మ(కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూశ్​ చావ్లా, జేసన్ బెరన్​డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాశ్​ మధ్వాల్
ఇంపాక్ట్‌ ప్లేయర్లు : రమణ్‌దీప్‌ సింగ్, విష్ణు వినోద్, నెహాల్ వధెరా, సందీప్ వారియర్, రాఘవ్‌ గోయల్

ఇదీ చదవండి : లోకల్​ టోర్నమెంట్ల నుంచి మధ్వాల్​ బ్యాన్​.. అందుకు భయపడే ఆ పని చేశారట!

Last Updated :May 26, 2023, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.