IPL 2023 SRH VS RCB : కోహ్లీ, డుప్లెసిస్​ విధ్వంసం.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్​ ఆశలు సజీవం

author img

By

Published : May 18, 2023, 11:04 PM IST

Updated : May 19, 2023, 6:43 AM IST

Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore

ఐపీఎల్ 16వ సీజన్​లో భాగంగా ప్లే ఆఫ్స్​ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసింది. సన్​రైజర్స్​తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్​లో కోహ్లీ, డుప్లెసిస్​ కలిసి ధనాధన్ ఇన్నింగ్స్​ ఆడారు. జట్టుకు విజయాన్ని అందించారు.

IPL 2023 SRH VS RCB : ఐపీఎల్ 16వ సీజన్​లో భాగంగా సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన కీలక మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు అదరగొట్టింది. ప్లే ఆఫ్స్​ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో విజయం సాధించింది. 19.2 ఓవర్లో 187 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో గెలిచింది. 187 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ స్టార్ బ్యాటర్లు కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్​.. ఇద్దరే కలిసి దాదాపుగా పూర్తిచేశారు. కోహ్లీ(63 బంతుల్లో 100; 12x4,4x6) శతక్కొట్టాడు. ఫాఫ్​ డుప్లెసిస్​(47 బంతుల్లో 71; 7x42x6) ధనాధన్ బ్యాటింగ్ ఆడాడు. అయితే దూకుడుగా ఆడుతున్న కోహ్లీ, డుప్లెసిస్​ను చివర్లో.. వరుస ఓవర్లలో మూడు బంతుల తేడాతో పెవిలియన్​కు పంపారు సన్​రైజర్స్ బౌలర్లు. విరాట్​ను 17.5ఓవర్లలో భువనేశ్వర్​ పెవిలియన్​ పంపగా.. డుప్లెసిస్​ను 18.2ఓవర్లో నటరాజన్​ ఔట్​ చేశాడు. ఇక చివర్లో వచ్చిన గ్లెన్ మ్యాక్స్​వెల్​, మైఖెల్​ బ్రాస్​వెల్​​ మిగతా లక్ష్యాన్ని పూర్తి చేశారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్​.. భారీ స్కోరు సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (104; 51 బంతుల్లో 8x4, 6x6) సెంచరీ బాదడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (27* 2x4,1x6), అభిషేక్ శర్మ (14 బంతుల్లో 11; 2x4), రాహుల్ త్రిపాఠి (12 బంతుల్లో 15; 2x4, 1x6), మార్క్రమ్ (20 బంతుల్లో 18) రాణించారు. బెంగళూరు బౌలర్లలో బ్రాస్​వెల్​ 2 వికెట్లు పడగొట్టగా.. షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. సన్​రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలను బ్రాస్​వెల్​ ఒకే ఓవర్​లో ఔట్ చేశాడు. ఈ క్రమంలో వన్​డౌన్​లో వచ్చిన మార్​క్రమ్​తో​ కలిసి హెన్రిచ్​ క్లాసెన్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాట్​ను ఝళిపించిన అతడు ఫోర్లు, సిక్స్​లు బాదాడు. 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న అతడు.. తర్వాత కూడా జోరు కొనసాగిస్తూ.. 49 బంతుల్లోనే సెంచరీ బాదాడు. హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్​లో మూడో బంతికి సిక్స్ బాది మూడంకెల స్కోరును శతకాన్ని అందుకున్నాడు. అదే ఓవర్లో ఐదో బంతికి భారీ షాట్ ఆడేందుకు యత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్ ఆశించినంత వేగంగా ఆడకపోవడం వల్ల.. సన్​రైజర్స్ 186 పరుగులకు పరిమితం కావాల్సి వచ్చింది.

ఇదీ చూడండి: IPL 2023 SRH VS RCB : హెన్రిచ్ సెంచరీ.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం

Last Updated :May 19, 2023, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.