IPl 2021 News: నటరాజన్​ స్థానంలో ఉమ్రన్​కు చోటు

author img

By

Published : Sep 24, 2021, 4:27 PM IST

Updated : Sep 24, 2021, 4:44 PM IST

Umran Malik

ఐపీఎల్​ 2021లో(IPL 2021 Live) కరోనా కారణంగా క్వారంటైన్​లో ఉన్న పేసర్ నటరాజన్(natarajan ipl 2021)​కు తాత్కాలిక భర్తీని ప్రకటించింది సన్​రైజర్స్ హైదరాబాద్. ఇతడి స్థానంలో ఉమ్రన్ మాలిక్​ను తీసుకుంది. మరి ఈ ఉమ్రన్ ఎవరో తెలుసా?

ఐపీఎల్ 2021 (IPL 2021 Live) సెకండ్ ఫేజ్​లోనూ కరోనా కలవరం రేపింది. సన్​రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad ipl) పేసర్ నటరాజన్(natarajan ipl 2021)​కు కొవిడ్ 19 పాజిటివ్​గా తేలింది. దీంతో దిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో నట్టూతో పాటు అతడితో సన్నిహితంగా ఉన్న మరో ఐదుగురిని క్వారంటైన్​లో ఉంచింది సన్​రైజర్స్. తాజాగా కరోనా కారణంగా దూరమైన నటరాజన్​కు తాత్కాలిక భర్తీగా మరో ఆటగాడిని తీసుకుంది. అతడే జమ్మూ కశ్మీర్​కు చెందిన ఉమ్రన్ మాలిక్(umran malik sunrisers hyderabad). నట్టూ మహమ్మారి నుంచి కోలుకుని తిరిగే బయోబబుల్​లో చేరేవరకు ఉమ్రన్​ జట్టుకు సేవలందిస్తాడు. యూఏఈలో ప్రస్తుతం సన్​రైజర్స్​కు నెట్​బౌలర్​గా కొనసాగుతున్నాడు మాలిక్.

ఎవరీ ఉమ్రన్?

ఉమ్రన్ మాలిక్​(umran malik sunrisers hyderabad) స్వస్థలం జమ్మూ కశ్మీర్. నవంబర్ 22, 1999లో జన్మించాడు. ఆ రాష్ట్రం తరఫునే దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఒకే ఒక టీ20 ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా రైల్వేస్​తో జరిగిన మ్యాచ్​లో ఇతడు పాల్గొన్నాడు. ఈ మ్యాచ్​లో నాలుగు ఓవర్లు వేసి 24 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు.

అలాగే విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బంగాల్​తో జరిగిన లిస్ట్​-ఏ మ్యాచ్​లోనూ ఆడాడు ఉమ్రన్(umran malik sunrisers hyderabad). కానీ అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్​లో 10 ఓవర్లు వేసి 98 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. బ్యాటింగ్​లో 8 బంతుల్లో 14 పరుగులు సాధించాడు.

సన్​రైజర్స్​కు నిరాశ

ఐపీఎల్ 2021(IPL 2021 Live) తొలి విడతలో ఏడు మ్యాచ్​లాడిన సన్​రైజర్స్(sunrisers hyderabad ipl)​ కేవలం ఒక్క మ్యాచ్​లోనే గెలిచింది. దీంతో వార్నర్​ను కెప్టెన్సీ నుంచి తప్పించింది యాజమాన్యం(పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి). సెకండ్ ఫేజ్​లో అయినా విలియమ్సన్ కెప్టెన్సీలో జట్టు మంచి ప్రదర్శన చేస్తుందనుకుంటే దిల్లీ క్యాపిటల్స్​(dc vs srh 2021)తో జరిగిన తొలి మ్యాచ్​లోనే చేతులెత్తేసింది (పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). దీంతో ప్లే ఆఫ్స్ బెర్తును సంక్లిష్టం చేసుకుంది. సన్​రైజర్స్ ఈ సీజన్​లో టాప్​-4లో నిలవాలంటే ఇకపై ప్రతి మ్యాచ్​లోనూ గెలవాలి. అలాగే మిగతా జట్ల సమీకరణాలు కూడా సన్​రైజర్స్​కు అనుకూలంగా మారాలి.

ఇవీ చూడండి: CSK Vs RCB: ఈ రికార్డులపై లుక్కేయండి గురు!

Last Updated :Sep 24, 2021, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.