IPL 2021 News: ధోనీ బౌలింగ్​లో జడేజా సిక్సుల వర్షం

author img

By

Published : Sep 24, 2021, 5:25 PM IST

Dhoni

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(royal challengers bangalore 2021)తో మ్యాచ్​కు ముందు ప్రాక్టీస్​లో శ్రమిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్(csk vs rcb 2021). ఈ సమయంలోనే నెట్స్​లో ధోనీ, జడేజా తలపడ్డారు. జడేజాకు ధోనీ బౌలింగ్ చేసిన ఈ వీడియోను నెట్టింట షేర్ చేసింది ఫ్రాంచైజీ.

ఐపీఎల్ 2021(IPL 2021 News) రెండో దశ కోసం యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నెట్స్​లో ఎంజాయ్ చేస్తున్నాడు. సెకండ్ ఫేజ్ తొలి మ్యాచ్​లో పటిష్ట ముంబయి ఇండియన్స్​(mi vs csk 2021)ను చిత్తుచేసిన సీఎస్కే.. నేడు (సెప్టెంబర్ 24) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(csk vs rcb 2021)తో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ ముమ్మరం చేసింది. ఈ సమయంలోనే నెట్స్​లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు మహీ.

సీఎస్కే నెట్స్​లో ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాకు బౌలింగ్ చేశాడు ధోనీ(dhoni bowling action). మామూలుగా మీడియం పేస్ వేసే మహీ ఈసారి స్పిన్ ట్రై చేశాడు. ధోనీ బౌలింగ్​(dhoni bowling action)లో మొదట వరుస బంతులను స్టాండ్స్​లోకి పంపాడు జడ్డూ. తర్వాత ఫ్లాట్​ డెలివరీతో జడేజాను బోల్తా కొట్టించాడు మహీ. వీరిద్దరి మధ్య పోరుకు సంబంధించిన వీడియోను నెట్టింట విడుదల చేసింది ఫ్రాంచైజీ. దీనిపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముంబయి(mi vs csk 2021)తో జరిగిన మ్యాచ్​లో 20 పరుగుల తేడాతో విజయం సాధించిన చెన్నై. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఓపెనర్​ రుతురాజ్ గైక్వాడ్​తో కలిసి 81 పరుగుల భాగస్వామ్యం నిర్మించి ఇన్నింగ్స్​ను గాడినపెట్టాడు జడేజా. వీరిద్దరి పోరాటంతో ధోనీసేన 156 పరుగులు చేయగలిగింది. తర్వాత ముంబయిని 136 పరుగులకే కట్టడి చేసి విజయం సాధించింది.

నేడు (సెప్టెంబర్ 24) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(royal challengers bangalore 2021)తో తలపడనుంది ధోనీ సారథ్యంలోని సీఎస్కే. ముంబయి(mi vs csk 2021)పై విజయంతో చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉండగా.. కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో ఓటమిపాలైన ఆర్సీబీ.. ఈ మ్యాచ్​లోనైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది.

ఇవీ చూడండి: నటరాజన్​ స్థానంలో ఉమ్రన్​కు చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.