Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బంపర్​ ఆఫర్​.. ఆ జట్టుకు కెప్టెన్​గా ఛాన్స్​!

author img

By

Published : Jan 10, 2022, 7:44 PM IST

Hardik Pandya

Hardik Pandya: టీమ్​ఇండియా ఆల్​రౌండర్​, ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ మాజీ ప్లేయర్​ హార్దిక్​ పాండ్యకు గోల్డెన్ ఛాన్స్​ దక్కనుంది. తమ జట్టుకు కెప్టెన్​గా హార్దిక్​ను ఎంపిక చేయాలని కొత్త ఫ్రాంఛైజీ అహ్మాదాబాద్​ భావిస్తున్నట్లు సమాచారం.

Hardik Pandya: ఐపీఎల్​లో కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్​ జట్టుకు కెప్టెన్​గా​ టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నాడని సమాచారం. ఐపీఎల్​లోని విశ్వసనీయ వర్గాలు ఈమేరకు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు ఐపీఎల్​ 2022 మెగా వేలం బెంగళూరులో ఫిబ్రవరి రెండో వారంలో జరగనుంది. అది ఫిబ్రవరి 11-13 మధ్య జరగవచ్చని తెలుస్తోంది.

మెగా వేలం నేపథ్యంలో గతేడాది నవంబర్​లో ప్రస్తుత ఐపీఎల్​ ఫ్రాంఛైజీలన్నీ.. తాము రీటెయిన్ చేసుకున్న ప్లేయర్ల జాబితా విడుదల చేశాయి. అందులో భాగంగా హార్దిక్​ను వదిలేసుకుంది ముంబయి ఇండియన్స్​.

ఇదీ చూడండి: హార్దిక్ భావోద్వేగం.. ముంబయి ఇండియన్స్​ను మరవలేనంటూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.