ఇక వన్డే సిరీస్ సమరం​.. బరిలోకి డబుల్​ సెంచరీ వీరులు.. ప్లేయింగ్​ 11 ఇదే!

author img

By

Published : Mar 14, 2023, 10:32 AM IST

Updated : Mar 14, 2023, 10:42 AM IST

IND VS AUS ODI Series schedule

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ టెస్ట్ సిరీస్ విజయంతో ఫుల్​ జోష్​లో ఉన్న టీమ్​ఇండియా.. ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్​ ఆడేందుకు సిద్ధంకానుంది. ఆ సిరీస్​ షెడ్యూల్​తో పాటు తొలి వన్డే ప్లేయింగ్​ 11 వివరాలు మీకోసం..

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ ఆస్ట్రేలియా టీమ్​ఇండియా టెస్ట్ సిరీస్​ ముగిసింది. ఈ నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మన ప్లేయర్లంతా బాగానే రాణించడం వల్ల భారత్​ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. దీంతో టీమ్​ఇండియా వరుసగా నాలుగోసారి ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని తన దగ్గరే అట్టిపెట్టేసుకుంది. అలా ప్రస్తుతం టెస్టు సిరీస్ విజయంతో సంబరాలు చేసుకుంటున్న మన జట్టు.. మరో మూడు రోజుల్లో ఆసీస్‌తో వన్డే సిరీస్​లో తలపడనుంది. మార్చి 17 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ముంబయి, విశాఖపట్నం, చెన్నై వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్​కు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే భారత జట్టును కూడా ఎంపిక చేశారు సెలక్టర్లు. కానీ ఇప్పుడు గాయం కారణంగా అహ్మదాబాద్ టెస్ట్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్.. తొలి వన్డేకు కూడా దూరమయ్యాడని తెలిసింది. దీంతో అతడి స్థానంలో జరగబోయే సిరీస్​లో సంజూ శాంసన్​ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్​ వర్గాలు చెబుతున్నాయి.

అలాగే తల్లి మరణంతో జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడనేది కచ్చితంగా చెప్పలేం. అతడు కొద్ది రోజుల వరకు ఆడేది అనుమానంగానే ఉంది. దీంతో ఆసీస్‌ జట్టుకు మళ్లీ స్టీవ్ స్మిత్ సారథిగా వ్యవహరించే ఛాన్స్​ ఉంది. ఇకపోతే వ్యక్తిగత కారణాల వల్ల టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మ కూడా తొలి వన్డేకు అందుబాటులో ఉండట్లేదు. దీంతో భారత జట్టుకు తొలి వన్డేలో హార్దిక్ పాండ్య కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. ఇకపోతే ఈ మ్యాచ్​కు డబుల్​ సెంచరీ వీరులు శుభమన్​ గిల్​, ఇషాన్ కిషన్ అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం.

తొలి వన్డేకు ఆస్ట్రేలియా జట్టు(అంచనా)

స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా, మిచెల్ స్టార్క్.

తొలి వన్డేకు టీమ్​ఇండియా(అంచనా)

హార్దిక్ పాండ్య(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, మహ్మద్​ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.

వన్డే సిరీస్ షెడ్యూల్ పూర్తి వివరాలు..

మార్చి 17- తొలి వన్డే- వాంఖడే స్టేడియం, ముంబయి.

మార్చి 19 - రెండో వన్డే వైఎస్సార్​ స్టేడియం, విశాఖపట్నం.

మార్చి 22 - మూడో వన్డే ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై.

ఇదీ చూడండి: 'నేను బౌలింగ్ మానేయాలా'.. అశ్విన్​ షాకింగ్ ట్వీట్​ వైరల్​!

Last Updated :Mar 14, 2023, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.