హిట్​మ్యాన్​ రికార్డ్ బ్రేక్ చేసిన కివీస్ ప్లేయర్.. టీ20ల్లో టాపర్​గా

author img

By

Published : Jul 28, 2022, 2:10 PM IST

Martin guptil Rohith sharma record

Martin guptil Rohith sharma record: న్యూజిలాండ్ ప్లేయర్​ మార్టిన్‌ గుప్టిల్‌ టీ20 క్రికెట్​లో కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

Martin guptil Rohith sharma record: న్యూజిలాండ్​ ఓపెనర్​ మార్టిన్ గుప్తిల్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈడిన్​బర్గ్​ వేదికగా స్కాట్​ల్యాండ్​తో జరిగిన మ్యాచ్​లో 31 బంతుల్లో 40 పరుగులు చేసిన గుప్తిల్​.. అంతర్జాతీయ టీ20ల్లో 3,399 పరుగులు చేశాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్​తో రోహిత్​ రికార్డ్​ బ్రేక్​ అయింది. అప్పటివరకు 3379 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్న హిట్​మ్యాన్​.. 20 పరుగులు వెనుకబడి రెండోస్థానానికి చేరుకున్నాడు. 3,308 పరుగులతో మూడో స్థానంలో విరాట్​ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఐర్లాండ్‌కు చెందిన పాల్‌ స్టిర్లింగ్‌(2894 పరుగులు) నాలుగో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌(2855 పరుగులు) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా కివీస్‌ తరపున టి20ల్లో మూడువేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడు మార్టిన్‌ గప్టిల్‌. అంతకుముందు మాజీ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌(2140 పరుగులు) మాత్రమే ఉన్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే స్కాట్లాండ్‌పై కివీస్‌ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ‍బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఫిన్‌ అలెన్‌(56 బంతుల్లో 101, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో విధ్వంసం చేయగా.. గుప్టిల్‌ 40, నీషమ్‌ 30 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కాట్లాండ్‌ బ్యాటర్స్‌లో గాలమ్‌ మెక్‌లీడ్‌ 33, క్రిస్‌ గ్రీవ్స్‌ 31 పరుగులు చేశారు.

ఇదీ చూడండి: ఆసియా కప్​ వేదిక మార్పు.. ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.