ఆ విషయంపై రోహిత్​-ద్రవిడ్​ ఆందోళన చెందుతున్నారు: దాదా

author img

By

Published : Sep 23, 2022, 4:15 PM IST

rohith dravid

టీమ్​ఇండియా ఓటములపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. అలానే కోహ్లీ శతకం బాదటంపై కూడా మాట్లాడాడు. ఏం అన్నాడంటే..

ఆసియాకప్‌ నుంచి టీమ్‌ఇండియా ఓటములు పెరగడంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. భారత ప్లేయర్స్​ అప్రమత్తమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పరోక్షంగా చెప్పాడు. ముఖ్యంగా పెద్ద టోర్నమెంట్లలో రాణించకపోవడం ఆందోళనకర విషయమని అంగీకరించాడు. విరాట్‌ శతకంపైనా మాట్లాడాడు.

"రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా 80శాతం విజయాలు సాధించాడు. ఇటీవల భారత్‌ ముడు నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అతడు మొత్తం 35-40 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేశాడు. ఆ మొత్తంలో కేవలం ఐదో లేదా ఆరో మ్యాచ్‌లు ఓడిపోయి ఉంటాడు. రోహిత్‌- రాహుల్‌ ద్రవిడ్‌లు టీమ్‌ఇండియా ప్రస్తుత ఆటతీరుపై ఆందోళన చెందుతుంటారని కచ్చితంగా చెప్పగలను. వాళ్లు మెరుగుపర్చుకొంటారు" అని గంగూలీ అన్నాడు.

"ఒకట్రెండ్‌ మ్యాచ్‌ల్లో ఓటములకు నేను ఆందోళన చెందను. కానీ, మేము పెద్ద టోర్నమెంట్లలో రాణించడంలేదు. మేం దానిపై చర్చిస్తాం. వరల్డ్‌కప్‌లో ఆడేందుకు జట్టు రెండు మూడు వారాల్లో ఆస్ట్రేలియాకు వెళుతుంది. అక్కడ ప్రాక్టిస్‌ మ్యాచ్‌లు ఆడి పరిస్థితులకు అలవాటుపడుతుంది. ఆసియాకప్‌లో కోహ్లీ శతకం సాధించడం శుభవార్త. ఈ ఊపును కొనసాగిస్తాడని ఆశిస్తున్నాను" అని దాదా వెల్లడించాడు. కాగా, ఆసియా కప్‌ ఫైనల్‌కు చేరడంలో టీమ్​ఇండియా ఫెయిల్ అయింది. మరోవైపు ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.

ఇదీ చూడండి: సిరీస్​లో నిలవాలంటే.. గెలవాల్సిందే! జట్టులో కీలక మార్పులకు ఛాన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.