'ఈ పద్ధతితో కుర్రాళ్లకు రోల్ మోడల్ అవ్వడం కష్టం'

author img

By

Published : Jan 14, 2022, 12:52 PM IST

Gambhir Slams Kohli

Gambhir Slams Kohli: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో డీఆర్​ఎస్​ నిర్ణయంపై టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరును.. 'పరిణతి లేని చర్యగా' అభివర్ణించాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఇలా అయితే.. కుర్రాళ్లకు రోల్ మోడల్​ ఎప్పటికీ కాలేవని అన్నాడు.

Gambhir Slams Kohli: దక్షిణాఫ్రికాతో చివరిటెస్టులో భాగంగా.. మూడోరోజు ఆటలో టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్​ గౌతమ్ గంభీర్.. కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. డీఆర్​ఎస్​ నిర్ణయంపై కోహ్లీ వ్యవహరించిన తీరును 'పరిణతి లేని చర్యగా' అభివర్ణించారు. ఈ విధానంతో కుర్రాళ్లకు రోల్ మోడల్​ ఎప్పటికీ కాలేవని అన్నాడు గంభీర్​.

" ఇది చాలా దురదృష్టకరం. స్టంప్స్​ మైక్ వద్దకు వెళ్లి వ్యాఖ్యలు చేయడం ఒక పరిణతి లేని చర్య. అంతర్జాతీయ కెప్టెన్​, టీమ్​ఇండియా సారథి నుంచి కోరుకునేది ఇది కాదు." అని గంభీర్​ స్పష్టం చేశాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో మయాంక్ అగర్వాల్ ఎల్​బీడబ్ల్యూ విషయంలోనూ ఇలాంటి నిర్ణయమే వచ్చిందని.. ఆ సమయంలో సౌతాఫ్రికా కెప్టెన్​ వ్యవహరించిన తీరును గుర్తుచేశాడు గంభీర్.

"టెక్నాలజీ మీ చేతిలో లేదు. అలాంటప్పుడు నువ్వు దక్షిణాఫ్రికా కెప్టెన్​ డీన్ ఎల్గర్​ లానే వ్యవహరించాల్సింది." అని గంభీర్ అన్నాడు.

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ డేరిల్​ కల్లీనన్ కూడా కోహ్లీ వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. కోహ్లీ.. తాను ఎలా అనుకుంటే అలానే ప్రవర్తిస్తాడని మండిపడ్డాడు. అలాంటి ప్రవర్తనతో కోహ్లీకి ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఆటను ప్రేమిస్తానని, అతడు ఆడే విధానం తనకు నచ్చుతుందని.. కానీ ఇలాంటి చర్యలకు అతడిని శిక్షించాలని అన్నాడు.

ఏమైందంటే..?

సఫారీ రెండో ఇన్నింగ్స్‌ 21వ ఓవర్లో ఎల్గర్‌ ఎల్బీడబ్ల్యూ కోసం జట్టు అప్పీల్‌ చేసింది. మైదానంలో ఉన్న అంపైర్‌ ఎరాస్మస్‌ ఔటిచ్చాడు. కానీ సమీక్ష కోరిన ఎల్గర్‌ కూడా రిప్లేలో మొదట బంతి గమనాన్ని చూసి పెవిలియన్‌ బాట పట్టాడు. కానీ చివరకు బంతి వికెట్ల మీద నుంచి వెళ్తున్నట్లు తేలింది. దీంతో అతను తిరిగొచ్చి బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఒక్కసారిగా స్టంప్స్‌ పై నుంచి బంతి వెళ్తుందని సమీక్షలో చూపించడంతో కోహ్లి అసహనం వ్యక్తం చేశాడు.

అది కీలక వికెట్‌ కావడంతో దక్షిణాఫ్రికా అధికార ప్రసారదారైన సూపర్‌ స్పోర్ట్‌ను ఉద్దేశించి స్టంప్‌ మైక్‌ దగ్గరకు వెళ్లి వ్యాఖ్యలు చేశాడు. "బంతికి మెరుగు పెడుతున్నపుడు.. కేవలం ప్రత్యర్థి పైనే కాదు మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి. ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టుకోవాలని చూస్తారు"అని అతనన్నాడు.

ఆ వెంటనే.. "పదకొండు మందికి వ్యతిరేకంగా మొత్తం దేశం ఉంది" అని కేఎల్‌ రాహుల్‌ అనడం వినిపించింది. "సూపర్‌స్పోర్ట్‌.. మీరు గెలవాలంటే మెరుగైన మార్గాన్ని ఎంచుకోండి" అని అశ్విన్‌ మాట్లాడాడు.

ఇదీ చూడండి: 'ముందు వాటిపై దృష్టిపెట్టు'.. కోహ్లీకి నెటిజన్ల చురకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.