IND Vs ENG: ఐదో టెస్టు రద్దుపై రవిశాస్త్రి స్పందన

author img

By

Published : Sep 12, 2021, 7:07 PM IST

IND Vs ENG 5th Test called off: Ravi Shastri defends book launch, says whole of UK is open

మాంచెస్టర్​ వేదికగా భారత్​, ఇంగ్లాండ్​ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు(India Vs England 5th Test) కరోనా కారణంగా రద్దైంది. అయితే ఈ మ్యాచ్​ రద్దవ్వడానికి ప్రధానకారణంగా టీమ్ఇండియా కోచ్​ రవిశాస్తి ఓ పుస్తకావిష్కరణ(Ravi Shastri Book Launch) కోసం వెళ్లడమే కారణమని మీడియాలో కొన్ని కథానాలు వచ్చాయి. వాటిపై తొలిసారి భారత ప్రధానకోచ్​ రవిశాస్త్రి స్పందించాడు.

భారత్​, ఇంగ్లాండ్​ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్టు(IND Vs ENG 5th Test) కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే టీమ్ఇండియా శిబిరంలో కరోనా రావడానికి ప్రధానకారణం కోచ్​ రవిశాస్త్రి పుస్తకావిష్కరణకు(Ravi Shastri Book Launch) వెళ్లడమేనని పలు మీడియా కథనాలు రాసుకొచ్చాయి. భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) అనుమతి లేకుండా కోచ్​తో పాటు ఇతర ఆటగాళ్లు ఆ ఈవెంట్​కు వెళ్లారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత కోచ్​ రవిశాస్త్రితో పాటు మరో నలుగురికి కరోనా సోకడం వల్ల ఇంగ్లాండ్​తో చివరి టెస్టు రద్దు చేయాల్సి వచ్చింది. ఇలాంటి కథనాలపై కోచ్​ రవిశాస్త్రి తొలిసారి స్పందించాడు.

"యూకే అంతటా జీవనం యథావిధిగా సాగుతుంది. ఎక్క‌డా ఎలాంటి ఆంక్ష‌లు లేవు. ఒకవేళ జరిగితే తొలి టెస్టు నుంచే ఏదైనా అయ్యుండాల్సింది"

- రవిశాస్త్రి, టీమ్ఇండియా కోచ్​

ఇంగ్లాండ్​ పర్యటనలో భాగంగా ఆడిన టెస్టు సిరీస్​లో(IND Vs ENG Test Series) టీమ్​ఇండియా అద్భుతంగా రాణించిందని కోచ్​ రవిశాస్త్రి ప్రశంసించాడు. కరోనా సంక్షోభంలో భారత జట్టులాగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ జట్లూ అలాంటి ప్రదర్శన చేయలేదని స్పష్టం చేశాడు.

ఇదీ చూడండి.. 'అశ్విన్​ చేరికతో అత్యుత్తమ జట్టుగా టీమ్ఇండియా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.