చెక్ బౌన్స్ కేసులో ధోనీకి ఊరట

author img

By

Published : Jul 31, 2022, 12:04 PM IST

Dhoni

చెక్ బౌన్స్ కేసులో మహేంద్ర సింగ్ ధోనీకి ఊరట లభించింది. ఆ కేసులో ధోనీని.. కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

చెక్ బౌన్స్ వివాదంలో చిక్కుకున్న టీమ్​ఇండియా మాజీ సారథి, ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్​ ధోనీకి ఊరట లభించింది. బిహార్​లో ధోనీపై చెక్ బౌన్స్ కేసు నమోదు కాగా.. తాజాగా కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ధోనీతో పాటు మరో నలుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

అసలేమైంది?
టీమ్​ఇండియా కెప్టెన్‌గా ధోనీ ఉన్న సమయంలో.. బిహార్​కు చెందిన ఓ ఫెర్టిలైజర్​ కంపెనీకి ప్రమోటర్​గా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ ఎంటర్ ప్రైజెస్ సంస్థ.. ధోనీ ప్రమోటర్​గా ఉన్న కంపెనీ నుంచి ఎరువులను కొనుగోలు చేసింది. అనంతరం ఆ ఎరువుల్లో నాణ్యత కొరవడిందని, అమ్ముడుపోలేదని.. కొనుగోలు చేసిన సంస్థ ఆరోపించింది. ఈ క్రమంలో ఫెర్టిలైజర్​ కంపెనీ.. ఆ ఎరువులను రిటర్న్​ తీసుకొని.. రూ. 30 లక్షల చెక్కును ఎంటర్​ ప్రైజెస్​ ఏజెన్సీకి అందజేసింది. అయితే ఆ చెక్కు బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది.

దీంతో ఎరువుల కంపెనీ ప్రమోటర్​గా ఉన్న ధోనీతో పాటు మరో నలుగురికి లీగల్ నోటీసులు పంపింది ఎంటర్​ ప్రైజెస్​ ఏజెన్సీ. ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. అందులో ధోనీ పేరు కూడా చేర్చారు. ఈ కేసుపై విచారించిన బెగూసరాయ్ కోర్టు.. ధోనీతో పాటు మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

ఇదీ చదవండి: అదరగొట్టిన వెయిట్​లిఫ్టర్లు.. కామన్​వెల్త్​ గేమ్స్​లో భారత్​కు 4 పతకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.