'ఢీ'లో సొహైల్, సుహాస్.. అదిరిపోయే స్టెప్పులు

author img

By

Published : Oct 15, 2021, 9:30 PM IST

Dhee latest promo

ఢీ లేటెస్ట్ ప్రోమో(dhee latest promo) అలరిస్తోంది. షోకు వచ్చిన పలువురు నటీనటులు తమ డ్యాన్సులతో దుమ్మురేపారు. ఇంతకీ ఎవరా యాక్టర్స్?

'ఢీ:13' డ్యాన్స్ షో క్వార్టర్స్​లోకి ప్రవేశించింది. ఈ సందర్బంగా డ్యాన్స్​ విత్ సెలబ్రిటీ రౌండ్​ పెట్టారు. దీంతో పలువురు నటీనటులు కంటెస్టెంట్​లతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకున్నారు.

'కలర్​ఫొటో'తో హీరోగా ఆకట్టుకున్న సుహాన్.. 'అత్తో అత్తమ్మ కూతురో' పాటకు అద్భుతమైన స్టెప్పులేసి అలరించారు. ఆ తర్వాత సుధీర్​-ఆదితో కలిసి పంచులు వేసి కామెడీ కూడా చేశారు.

కన్నడలో టాప్ కొరియోగ్రాఫర్​ యశ్వంత్​ మాస్టర్​గా కూడా షోలో పాల్గొని సందడి చేశారు. 'బిగ్​బాస్' ఫేమ్ సొహైల్​ కూడా 'గబ్బర్​సింగ్'లోని పిల్లా నువ్వే లేని జీవితం పాటకు అదిరిపోయేలా స్టెప్పులేశాడు. దీంతో పాటు 'నాట్యం' ఫేమ్ సంధ్యారాజు అతిథిగా విచ్చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.