Brahmanandam: కోట్ల కళ్లు.. ఈ 'షో' కోసం ఎదురుచూపులు!

author img

By

Published : Nov 23, 2021, 8:22 AM IST

alitho saradaga latest episode

ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఇంటర్వ్యూ మరికొన్ని రోజుల్లో ప్రసారంకానుంది. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం 'ఆలీతో సరదాగా' షోలో (alitho saradaga latest episode) సందడి చేయనున్నారు. ఆయన పంచుకున్న విశేషాలేంటో తెలియాలంటే నవంబర్​ 29న ప్రసారమయ్యే కార్యక్రమం చూడాల్సిందదే.

ఆయన నటించాల్సిన అవసరం లేదు. కేవలం ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు చిందుతాయి. ఇక డైలాగ్‌ చెప్పారంటే చాలు కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఆయనే తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన చార్లీచాప్లిన్‌, కామెడీ కింగ్‌ బ్రహ్మానందం. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్‌టైనింగ్‌ షో 'ఆలీతో సరదాగా' (alitho saradaga latest episode) కార్యక్రమానికి బ్రహ్మానందం విచ్చేసి సందడి చేశారు.

ఈ సందర్భంగా షో నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పుష్పవర్షం కురిపించారు. బ్రహ్మానందం ఇంటర్వ్యూ చూడటానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి ఆలీతో బ్రహ్మానందం (alitho saradaga brahmanandam) చెప్పిన ముచ్చట్లు ఏంటి? ఏయే అనుభవాలను పంచుకున్నారు? ఇద్దరి మధ్య పంచ్‌లు ఎలా పడ్డాయి? తెలియాలంటే నవంబరు 29న ప్రసారమయ్యే షో చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'చిరంజీవితో ఆ మాట చెప్పలేకపోయా.. అందుకే ఆ సినిమా ఆడలేదు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.