ఇంటర్నేషనల్​ ఫిల్మ్ ఫెస్టివల్.. ఆ డైరెక్టర్లకు సత్యజిత్ రే పురస్కారం

author img

By

Published : Oct 22, 2021, 9:23 AM IST

52nd International Film Festival of India

ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు సత్యజిత్ రే జీవిత సౌఫల్య పురస్కారాలను అందజేయనున్నారు. ఇంటర్నేషనల్​ ఫిల్మ్ ఫెస్టివల్​ ఆఫ్ ఇండియాలో వీటిని ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలకు తొలిసారిగా ఓటీటీ నిర్వహకులను ఆహ్వానించారు.

గోవాలో 52వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరగనుంది. నవంబరు 20 నుంచి 28 వరకు ఈ ఈవెంట్​ నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు తొలిసారి ఓటీటీ నిర్వహకులకు కూడా ఆహ్వానం పంపారు.

మార్టిన్ స్కోర్సెస్, ఇస్తవాన్ జబోకు సత్యజిత్ రే జీవిత సౌఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ వెల్లడించారు. మార్టిన్.. సినీ చరిత్రలోనే గ్రేటెస్ట్​ డైరెక్టర్లలో టాప్​లో ఉంటారు.

52nd International Film Festival of India
నవంబరులో ఇంటర్నేషనల్​ ఫిల్మ్ ఫెస్టివల్

భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం.. ఆసియాలో అత్యంత ప్రాచీన ఫిల్మ్​ ఫెస్టివల్. అలానే మన దేశంలోనే అతి పెద్దది. ఈ ఏడాది జనవరిలో 51వ చలనచిత్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించారు.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెడరేషన్​ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్​కు ఐఎఫ్ఎఫ్ఐ అనుబంధంగా ఉంటుంది. మన దేశంలో, ప్రపంచంలోనే కొన్ని అద్భుత చిత్రాల్ని.. ఈ చలనచిత్రోత్సవాల సందర్భంగా ప్రదర్శించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.