టాలీవుడ్ రేంజ్ పెరిగింది.. ప్రపంచం మన 'సినిమా' చూస్తోంది!

author img

By

Published : Jan 10, 2022, 6:15 PM IST

telugu movies

గత కొన్నేళ్లలో తెలుగు సినిమా రేంజ్​ పెరిగింది. ఒకప్పుడు మనవరకే పరిమితమైన సినిమాలు.. ఇప్పుడు ప్రపంచంలోని చాలా భాషల్లోని ఆడియెన్స్​ను మెప్పిస్తున్నాయి. కొత్త సినిమాల కోసం ఎదురుచూసేలా చేస్తున్నాయి. ఇంతకీ టాలీవుడ్​లో వచ్చిన మార్పేంటి? ఏం జరుగుతుంది?

2015 జులై 10. 'బాహుబలి' తొలిపార్ట్ నాలుగు భాషల్లో రిలీజ్. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా.. ఇలా కేవలం తెలుగు ఆడియెన్స్​కు మాత్రమే తెలిసిన నటీనటులు. కానీ సినిమా చూసిన ఇతర భాషల ప్రేక్షకులకు మైండ్​ బ్లాంక్​. అసలు కట్టప్ప 'బాహుబలి'ని ఎందుకు చంపాడు?

ఈ సినిమా రెండో పార్ట్​ వచ్చినంత వరకు ఇదే చర్చ. కేవలం తెలుగు ఆడియెన్స్​ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ సినిమా గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడ చూసిన దీని గురించే మాట్లాడుకోవడం. అలా తెలుగు సినిమా స్థాయిని 'బాహుబలి' అమాంతం పెంచేసింది. అప్పుడు మొదలైంది తెలుగు సినీ పరిశ్రమలో కొత్త శకం. అప్పటి నుంచి ఇప్పటివరకు అది సాగుతూ సరికొత్త ట్రెండ్​ చేస్తూ దూసుకుపోతుంది.

ఈ మధ్య రిలీజైన 'పుష్ప' సినిమానే తీసుకోండి. తొలుత దీనిని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయలేమని అనుకున్నారు. కానీ చివర్లో హడావుడిగా అసలు ఏ మాత్రం పబ్లిసిటీ లేకుండా నార్త్​లో(ఉత్తరాది) రిలీజ్​ చేస్తే ఏకంగా రూ.75 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓ ప్రాంతీయ సినిమా పవర్​ ఏంటో చూపించింది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్​ అనుకునే చాలామంది ఆలోచనను తెలుగు సినిమా మార్చేసింది, మార్చుతోంది, మార్చబోతుంది.

RRR movie
ఆర్ఆర్ఆర్ మూవీ

హద్దుల్ని చెరిపేస్తూ..

టెక్నాలజీ పెరిగి, ఓటీటీల రాకతో సినిమాలపై ఉన్న ప్రాంతీయ భావన పోయింది. తెలుగు రొమాంటిక్ సినిమాలు, తమిళ థ్రిల్లర్లు, మలయాళ నేటివిటీ సినిమాలను హిందీ, ఇతర భాష ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. భాష అర్థం కాకపోయినా సరే సబ్​టైటిల్స్​తో రిపీట్ షోలు వేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు తెలుగు సినిమా స్థాయి ఏ రేంజ్​లో పెరుగుతుందనేది. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్', 'లైగర్' తదితర సినిమాల కోసం ప్రేక్షకులందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

liger radhe shyam movies
లైగర్-రాధేశ్యామ్

పెరుగుతున్న రీమేక్​లు

ఒకప్పుడు ఇతర భాషల్లో బాగా ఆడిన, ఆడియెన్స్ ఆదరణ పొందిన సినిమాలు తెలుగులో రీమేక్​ అయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్​ మారింది. తెలుగులో మాత్రమే విడుదలై హిట్​లు కొట్టిన సినిమాలు.. ఇతర భాషల్లో రీమేక్​ అవుతున్నాయి. మన సత్తా ఏంటో ఆడియెన్స్​కు అర్థమయ్యేలా చేస్తున్నాయి.

అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో', ప్రభాస్ 'ఛత్రపతి', 'ఎఫ్2', 'హిట్', రవితేజ 'క్రాక్', అల్లరి నరేశ్ 'నాంది', 'అల వైకుంఠపురములో' చిత్రాలు హిందీ రీమేక్​ అవుతున్నాయి. ఇంకొన్ని సినిమాలు ఈ లిస్ట్​లో చేరేందుకు రెడీ అవుతున్నాయి.

allu arjun ala vaikunthapurramuloo
అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'

ఇతర భాషల డైరెక్టర్లు మన హీరోలతో..

ఒకప్పుడు మన హీరోలు ఇతర భాషల డైరెక్టర్లతో చేయడం చాలా తక్కువ. కానీ 'బాహుబలి' తర్వాత తెలుగు సినిమా తెగ క్రేజ్​ తెచ్చుకుంది. దీంతో ఇతర భాషల డైరెక్టర్లు మన కథానాయకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నారు.

ఓవైపు తెలుగులో యువ దర్శకులకు అవకాశమిస్తూనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్​తో 'ఆదిపురుష్', కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్​ నీల్​తో 'సలార్' సినిమాలు చేస్తున్నారు ప్రభాస్.

మరోవైపు మన దర్శకులు కూడా ఇతర భాషల్లోని స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. విజయ్​తో వంశీ పైడిపల్లి, శివకార్తికేయన్​తో అనుదీప్ లాంటి దర్శకులు ఈ లిస్ట్​లో ఉన్నారు. ముందు ముందు ఈ ట్రెండ్​ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

prabhas adipurush movie
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.