RRR song update: మరో పాట రిలీజ్​కు రెడీ

author img

By

Published : Nov 22, 2021, 6:52 PM IST

Updated : Nov 22, 2021, 7:37 PM IST

RRR

RRR song update: రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలోని 'జనని' పాట నవంబరు 26న విడుదల కానుంది. శక్తివంతంగా, హృదయానికి హత్తుకునేలా ఈ గీతం ఉంటుందని చిత్రబృందం తెలిపింది.

RRR song update: ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా 'ఆర్​ఆర్​ఆర్'(rrr movie updates today)​. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచారు. 'ఆర్ఆర్‌ఆర్‌' సోల్‌ యాంథమ్‌(RRR Soul Anthem) 'జనని' అంటూ సాగే పాటను విడుదల చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు. పెద్దన్న కీరవాణి స్వరపరిచిన పాట భావోద్వేగంతో సాగుతుందంటూ ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని 'దోస్తీ', 'నాటు నాటు' పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

RRR
ఆర్​ఆర్​ఆర్​

యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామాగా రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో అల్లూరి సీతరామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్​గా తారక్‌ (ntr ram charan rrr movie) నటించారు. ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. ఆలియాభట్‌ (RRR heroine), ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: టిక్కెట్‌ ధరల తగ్గింపుపై 'ఆర్‌ఆర్‌ఆర్‌' అసంతృప్తి

Last Updated :Nov 22, 2021, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.