నాన్న కోలుకుంటున్నారు.. పుకార్లు నమ్మొద్దు: కైకాల కుమార్తె

author img

By

Published : Nov 23, 2021, 12:25 PM IST

Updated : Nov 23, 2021, 3:14 PM IST

kaikala satyanarayana health

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవలే అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. క్రమంగా కోలుకుంటున్నారని సమాచారం.

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన సృహలోకి వస్తున్నారని, రక్తపోటు స్థిరపడుతోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు హెల్త్​ బులెటిన్ విడుదలైంది.

కైకాల కిడ్నీ పనితీరు మెరుగుపడుతోందని, మూత్ర విసర్జన సక్రమంగా జరుగుతోందని రిపోర్టులో ఉంది. ప్రస్తుతానికి ఐసీయూలోనే ఉన్నా.. వెంటిలేటర్​ అవసరం క్రమంగా తగ్గుతోందని సమాచారం.

తప్పుడు ప్రచారంపై కైకాల కుమార్తె స్పందన

కైకాల ఆరోగ్యం గురించి పలు రకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన ఆయన కుమార్తె రమాదేవి.. ప్రస్తుతం కైకాల ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలిపారు. ఆయన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. "నాన్నగారు క్రమంగా కోలుకుంటున్నారు. చికిత్సకు బాగా స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కైకాల ఆరోగ్యంపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు" అని రమాదేవి పేర్కొన్నారు.

కైకాల కూతురు ఆడియో

ఇదీ చూడండి: Kaikala satyanarayana health: కైకాలతో ఫోన్​లో మాట్లాడిన చిరు..

Last Updated :Nov 23, 2021, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.