ఆమె బయోపిక్​లో నటించాలని ఉంది: జాన్వీ

author img

By

Published : Oct 14, 2021, 7:35 AM IST

janvi

పారా ఒలింపిక్స్​లో విజయం సాధించిన అరుణిమా సిన్హా(arunima sinha mount everest) బయోపిక్​లో నటించాలని ఉందని తెలిపింది హీరోయిన్​ జాన్వీ కపూర్(janvikapoor latest movies)​. ఆమె కథ ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పింది.

బయోపిక్​లో(janhvi kapoor new upcoming movie) నటించే అవకాశం రావడం... అందులో నటించడం అంత సులువు కాదు. కెరీర్ తొలి అడుగులోనే బయోపిక్​లో నటించి ప్రశంసలు అందుకుంది జాన్వీ కపూర్. 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' చిత్రంలో నటించి మెప్పించిన జాన్వీ(gunjan saxena janhvi) ఇప్పుడు మరో జీవిత కథపై మనసు పారేసుకుంది. ఇటీవల పారా ఒలింపిక్స్ లో విజయం సాధించిన క్రీడాకారుల కోసం దిల్లీలో ఓ సన్మాన కార్యక్రమం జరిగింది. ఇష్టాగోష్టిగా ముచ్చటించింది జాన్వీ. ఈ సందర్భంగా అరుణిమా సిన్హా జీవిత కథలో నటించాలని ఉంది అంటూ మనసులో మాట బయట పెట్టింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి దివ్యాంగురాలిగా చరిత్ర సృష్టించారు అరుణిమ. "నేను అరుణిమను కలిశాను. ఆమె కథ ఎంతో స్ఫూర్తిదాయకం, ఆమె పాత్ర పోషించాలని ఎంతో ఆశగా ఉంది" అని చెప్పింది.

janvi
జాన్వీకపూర్​

ప్రస్తుతం జాన్వీ(janvikapoor latest update).. 'దోస్తానా 2', 'గుడ్​లక్​ జెర్రీ', 'మిలీ' సినిమాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి: 'అప్పుడే అల్లుఅర్జున్​ కొత్త సినిమాలపై క్లారిటీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.