Akhanda songs: 'జై బాలయ్య' వీడియో సాంగ్ రిలీజ్

Akhanda songs: 'జై బాలయ్య' వీడియో సాంగ్ రిలీజ్
సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో జై బాలయ్య సాంగ్, రౌడీబాయ్స్ పార్టీ సాంగ్, ఉనికి ట్రైలర్, ముఖచిత్రం సినిమా ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.
Akhanda jai balayya song: 'అఖండ' నుంచి 'జై బాలయ్య' పూర్తి వీడియో సాంగ్ రిలీజైంది. ఇందులో బాలయ్యతో పాటు ప్రగ్యా జైస్వాల్ అదిరిపోయే స్టెప్పులేసి తెగ సందడి చేసింది.
మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ, ద్విపాత్రాభినయం చేశారు. అఘోరా గెటప్‌లో అదరగొట్టేశారు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పించింది. బోయపాటి శ్రీను.. ఈ సినిమాతో బాలయ్య కాంబోలో హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు.
'రౌడీబాయ్స్' సినిమాలోని 'డేట్ నైట్' అంటూ సాగే పార్టీ సాంగ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.
ఈ సినిమాతో ఆశిష్ హీరోగా పరిచయమవుతున్నాడు. అనుపమ హీరోయిన్. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రం తీశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. శ్రీ హర్ష దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మించారు.
హీరో వరుణ్ తేజ్ చేతుల మీదుగా 'ఉనికి' ట్రైలర్ రిలీజైంది. తూర్పు గోదావరి కలెక్టర్‌గా ఉన్న హీరోయిన్‌కు ఎదురైన ఇబ్బందులు? వాటిని ఓ పోలీస్ ఎలా పరిష్కరించారు? అనే కథతో ఈ సినిమా తీశారు.
ఆశిష్ గాంధీ, చిత్రా శుక్లా హీరోహీరోయిన్లుగా నటించారు. రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలోకి సినిమా రానుంది.
'కలర్‌ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందించిన సినిమా 'ముఖచిత్రం'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ సినిమాతోనే గంగాధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు.
ఇవీ చదవండి:
- టాలీవుడ్ రేంజ్ పెరిగింది.. ప్రపంచం మన 'సినిమా' చూస్తోంది!
- 'పుష్ప'లో ఆ ఒక్క షాట్ కోసం 12 గంటలు కష్టపడ్డ బన్నీ
- లివ్ ఇన్ రిలేషన్లో నిధి అగర్వాల్.. త్వరలో ఆ హీరోతో పెళ్లి?
- 'అఖండ' తర్వాత మారిన బాలయ్య లెక్క.. రెమ్యూనరేషన్ భారీగా పెంపు!
