బ్లాక్ చేసిన వాట్సాప్ నెంబర్ల నుంచి ఎన్ని కాల్స్ వచ్చాయో తెలుసుకోండిలా..

author img

By

Published : Dec 4, 2022, 12:04 PM IST

top 5 whatsapp app

సామాజిక మాధ్యమాల పేర్లు చెప్పమనగానే ముందుగా అందరికీ గుర్తుకువచ్చేది వాట్సాప్. ఈ యాప్​ వినియోగదారులకు సులభంగా.. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అయితే, దీని ఉపయోగాన్ని మరింత సులభం చేసే కొన్ని అనుబంధ యాప్స్ ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే?

వాట్సాప్​.. ఎంతో ప్రాచుర్యం పొందిన సామాజిక మాధ్యమం. క్షణాల్లోనే సమాచారాన్ని చేరవేసే యాప్​లలో ముందు వరుసలో ఉంటుందీ యాప్. దీనిని చాలా మంది తమ వ్యక్తిగత వినియోగం కోసమే కాకుండా వ్యాపార, వాణిజ్య అవసరాలకు ఎక్కువగా వాడుతున్నారు. 100 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది వాట్సాప్​. ప్రస్తుతం వాట్సాప్ అందిస్తున్న ఫీచర్స్​ వాడకంతో మన స్నేహితులు, బంధువులకు మరింత దగ్గరవ్వచ్చు. దీంతో పాటు వాట్సాప్​లో లేని మరి కొన్ని సౌకర్యాలు కూడా దీనికి జోడిస్తూ పలు యాప్​లు వాట్సాప్​ యూజర్లకు సేవలందిస్తున్నాయి. ఫలితంగా వాట్సాప్​ వాడకాన్ని మరింతగా మెరుగుపరిచే ఆ టాప్ ఐదు యాప్​లు ఏమిటంటే..

టాప్ 5 యాప్స్ ఇవే..!

1. వాట్సాప్​ ఆటో రిప్లై
వాట్సాప్​ ఆటో రిప్లై సౌకర్యం వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చే సందేశాలకు స్పందిస్తూ తరచూ టైప్​ చేయకుండా.. ముందుగానే టైప్​ చేసి పెట్టుకున్న మెసేజ్​లను పంపవచ్చు. దీంతో అవతలి వ్యక్తికి ప్రస్తుతం మీరు బిజీగా ఉన్నారనే విషయం అర్థమవుతుంది. అంతేగాక అవతలి వ్యక్తి సమయం వృథా కాకుండా ఉంటుంది. కాకపోతే ఈ సేవలు కేవలం వాట్సాప్​ బిజినెస్​ యాప్​లో మాత్రమే కనిపిస్తాయి.

2. వాట్సాప్​ కాల్​ బ్లాకర్​
మాములుగా వాట్సాప్​లో ఎవరినైనా బ్లాక్​ చేయాలంటే బ్లాక్​ ఆప్షన్​ను వాడతాం. దీంతో అవతలి వ్యక్తిని బ్లాక్​ చేశామన్న విషయం వారికి ఇట్టే తెలిసిపోతుంది. అయితే మనం ఇతరులని బ్లాక్​ చేసిన తర్వాత వాళ్లు మనకు తరచూ మెసేజ్​ లేదా వాయిస్​, వీడియో కాల్స్ చేస్తుంటారు. కానీ వారిని బ్లాక్ చేయడం వల్ల అవి మనకు తెలిసే అవకాశం లేదు. దీనికి సరైన పరిష్కారం వాట్సాప్​ కాల్ బ్లాకర్. ఈ సాఫ్ట్​వేర్​తో అవతలి వ్యక్తి మనతో ఎన్ని సార్లు మాట్లాడటానికి ప్రయత్నించాడో కాల్​ లాగ్​ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సౌలభ్యం వాట్సాప్​ బిజినెస్​ యాప్​లో కూడా అందుబాటులో ఉంది.

3. స్టేటస్​ సేవర్​
వాట్సాప్​లో మన స్నేహితులు పెట్టే పలు స్టేటస్​లు మనకు భవిష్యత్​లో ఉపయోగపడవచ్చు. కానీ ఎప్పుడు వాటి అవసరం పడుతుందో చెప్పలేము. మాములుగా మనకు ఏదైనా స్టేటస్​ నచ్చితే స్క్రీన్​షాట్ తీసి సేవ్ చేసుకుంటాం. తర్వాత ఆ ఫొటో లేదా వీడియో కోసం వెతుకుతూ మన సమయాన్ని వృథా చేసుకొంటాం. దీనికి చెక్ పెట్టేందుకే స్టేటస్​ సేవర్​ యాప్ అందుబాటులోకి వచ్చింది.

4. స్టికర్​ మేకర్
ప్రస్తుతం ఈ స్టికర్​ మేకర్​ యాప్​ను వాడడం ద్వారా చాలా మందిలో ఉన్న సృజనాత్మకత బయటపడుతోంది. ఎందుకంటే యూజర్ అభిరుచులకు అనుగుణంగా స్టికర్స్​ను తయారు చేసుకోవచ్చు. ప్రత్యేకమైన రోజులు వస్తే దానికి తగ్గట్టు స్టికర్స్​ను రూపొందించుకోవచ్చు. వీటికి వ్యంగ్యం, హాస్యం, కోపం, బాధ వంటి నవరసాలనూ జోడించవచ్చు. ఒక ఫొటోను స్టికర్​ రూపంలోకి మార్చి అవి మరింత ఆకర్షణగా కనిపించేలా చేసుకునే సౌలభ్యం ఈ స్టికర్​ మేకర్​ యాప్ వినియోగదారులకు కల్పిస్తోంది.

5. డబ్ల్యు.ఏ.ఎమ్​.ఆర్
సాధారణంగా కొందరు మనకు సందేశాలు పంపించి మనము చూడకముందే వాటిని డిలీట్ చేస్తూంటారు. డిలీట్​ చేసిన మెసేజ్​ ఏమై ఉంటుందనే తెలుసుకోవాలనే ఆత్రుత అందరికీ ఉంటుంది. కానీ మనము అడిగితే మన స్నేహితులు, బంధువులు చెప్పకపోవచ్చు. కానీ ఈ డబ్ల్యు.ఏ.ఎమ్​.ఆర్(వాట్సాప్​ మెసేజ్​ రిట్రీవర్​) సాఫ్ట్​వేర్​ మన ఫోన్లో ఇన్​స్టాల్​ చేసుకోవడం ద్వారా తొలగించిన సందేశాల్ని సులువుగా తెలుసుకోవచ్చు.

ఇవీ చదవండి: స్మార్ట్ వాచ్​లోనే ఇయర్​ బడ్స్​.. కేస్​తో పనిలేదిక.. ఏం​ ఐడియా గురూ!

ఫోన్​లో యాప్​లు సీక్రెట్​గా ఉంచాలా? ఆండ్రాయిడ్​లో ఇలా చేస్తే సరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.