వాట్సాప్​లో కొత్త ఫీచర్స్.. చాట్​ లిస్ట్​లోనే స్టేటస్​.. గ్రూప్ కాలింగ్​లో మ్యూట్​​ ఆప్షన్​

author img

By

Published : Jun 20, 2022, 5:00 PM IST

WhatsApp news

WhatsApp updates: చాట్​ లిస్ట్​లోనే స్టేటస్​ను కూడా చూసేలా కొత్త ఆప్షన్​ను తీసుకొస్తోంది వాట్సాప్. ప్రస్తుతం ఇన్​స్టాగ్రాంలో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్​ను తమ వినియోగదారులకు కూడా అందించనుంది. అలాగే గ్రూప్​ కాలింగ్​లో మ్యూట్ ఆప్షన్​ను తీసుకురానుంది.

WhatsApp new feature: వినియోగదారుల కోసం మరిన్ని కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది వాట్సాప్​. ఇన్​స్టాగ్రాంలో ఉన్న ఫీచర్​ను తమ యూజర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం వాట్సాప్​లో ఇతరుల స్టేటస్​ చూడాలంటే చాట్స్​ పక్కన స్టేటస్ అనే ప్రత్యేక ట్యాబ్​ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తేనే ఇతరుల స్టేటస్ అప్డేట్లు కనిస్తుంటాయి. ఇప్పుడు రానున్న కొత్త ఫీచర్​లో డైరెక్ట్​గా చాట్​ లిస్ట్​లోనే ఇతరుల స్టేటస్​ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ తరహా ఫీచర్ ఇన్​స్టాగ్రాంలోనే ఉంది. త్వరలోనే వాట్సాప్​లోనూ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఆప్షన్ ప్రయోగ దశలో ఉంది.

గ్రూప్ కాలింగ్​లో మ్యూట్​: గ్రూప్ కాలింగ్​లో కొత్తగా మ్యూట్ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్​. అడ్మిన్​ ఇకపై ఇతరులు మాట్లాడేది వినిపించకుండా మ్యూట్​ చేయవచ్చు. అలాగే అప్పటికే ప్రారంభమైన గ్రూప్ కాల్​లో సభ్యులు ఎవరైనా కొత్తగా చేరితే నోటిఫికేషన్​ కూడా కనిపించనుంది. అంతేకాకుండా గ్రూప్​ కాల్ సమయంలో ఇతరులకు మెసేజ్ చేసే ఆప్షన్​ కూడా రానుంది.

అలాగే గ్రూప్​ చాట్ ఇన్విటేషన్​ లింక్ ద్వారా ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే అడ్మిన్​ అనుమతి తప్పనిసరి చేసేలా కొత్త అప్డేట్ రానుంది. గ్రూప్ సెట్టింగ్స్​లోకి వెళ్లి ఈ ఆప్షన్​ను అవసరాన్ని బట్టి ఆన్​ లేదా ఆఫ్​ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్లతో గ్రూప్ కాలింగ్, చాటింగ్​లో అడ్మిన్​లకు నియంత్రణ అధికారం రానుంది. ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్​ కాలింగ్​లో ఈ ఫీచర్లు లేవు. కొత్త ఫీచర్లతో గ్రూప్​లో అభ్యంతరకరంగా మాట్లాడేవారు, ఇతరులను ఇబ్బంది పెట్టేవారిని సులభంగా నియంత్రించే అవకాశం ఉండనుంది.

ఇదీ చదవండి: వాట్సాప్​ సరికొత్త అప్డేట్.. మీకు నచ్చినవారికే కనిపిస్తాయ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.