వాట్సాప్ యూజర్లకు గుడ్​న్యూస్.. కొత్తగా మెసేజ్ ఎడిట్ ఫీచర్!

author img

By

Published : Sep 20, 2022, 4:29 PM IST

WhatsApptesting edit message feature

మనం ఏదైనా మెసేజ్​ను టైప్​ చేసి పంపితే ఇక దాన్ని ఎట్టి పరిస్థితిలో మార్చలేము. పొరపాటున ఏదైన తప్పు టైప్​ చేస్తే ఇక అంతే! దాన్ని మార్చలేక నానా ఇబ్బందులు పడుతుంటాం. ఇకపై ఆ సమస్య ఉండదంటోంది వాట్సాప్​ సంస్థ.

whatsapp edit message : ఈ తరం మెసేజింగ్​ యాప్స్​లో పాపులరైన వాట్సాప్​ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్​ను ప్రవేశపెడుతోంది. వాట్సాప్​లో మనం ఏదైనా మెసేజ్​ను టైప్​ చేసి సెండ్​ చేస్తే ఇక దాన్ని ఎట్టి పరిస్థితిలో మార్చలేము. ఏదైన తప్పుగా టైప్​ చేసి పంపిస్తే ఇక అంతే.. దాన్ని 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఆప్షన్ ద్వారా తొలగించడం.. లేదంటే, ముందు మెసేజ్​కు కరెక్షన్​గా మరో మెసేజ్​ను పంపిచడం తప్ప ఏమీ చేయలేం. కానీ ఇకపై ఆ సమస్య ఉండదంటోంది వాట్సాప్​ సంస్థ. త్వరలో ఓ నయా ఫీచర్​ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. అదే 'ఎడిట్​ మెసేజ్స్​' ఫీచర్​.

ఈ ఫీచర్​ ద్వారా పంపిన మెసేజ్స్​ను రీ ఎడిట్​ చేసుకోవచ్చు. ఈ ఫీచర్​ను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు వాట్సాప్ సంస్థ తెలిపింది. ఈ ఫీచర్​ ఎలా పని చేస్తుందో తెలియనప్పటికి దీని ఉపయోగించిన యూజర్లకు అలాగే అవతలి వ్యక్తికి ఈ మెసేజ్​ను ఎడిట్​ చేశారని తెలిసేలా మెసేజ్​కు ఓ లేబుల్​ను జత చేసే ఆలోచనలో ఉందని సమాచారం.​

వాట్సప్​లో మరో కొత్త ఫీచర్..
చాట్‌ పేజీలో అవసరమైన మెసేజ్‌లను సులువుగా వెతికేందుకు వీలుగా కొత్త సెర్చ్‌ ఆప్షన్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం టెక్ట్స్‌తో సెర్చ్‌ చేసినట్లుగా, ఇకపై యూజర్లు డేట్‌తో సెర్చ్‌ చేయొచ్చు. దీంతో యూజర్లు తేదీల వారిగా వచ్చిన మెసేజ్‌లను ఫిల్టర్‌ చేసి చూడొచ్చు. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లకు సెర్చ్‌ బార్‌పై క్లిక్ చేస్తే క్యాలెండర్‌ ఐకాన్‌ కనిపిస్తుంది.

దానిపై క్లిక్‌ చేస్తే క్యాలెండర్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో తేదీపై టాప్‌ చేస్తే ఆ రోజు వచ్చిన మెసేజ్‌లు చాట్‌ పేజీలో కనిపిస్తాయి. అలా కిందకు స్క్రోల్‌ చేస్తూ తర్వాతి, ముందు రోజు మెసేజ్‌లను కూడా యూజర్‌ చూడొచ్చు. దీనివల్ల యూజర్‌ ఏ రోజు ఏయే మెసేజ్‌లు పంపారనే వివరాలతో పాటు, మెసేజ్‌ సెర్చింగ్ సులువుగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఐఓఎస్‌ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది.

వాట్సాప్ సర్వే
డేట్ సెర్చ్‌ ఫీచర్‌తోపాటు 'వాట్సాప్ సర్వే' పేరుతో మరో కొత్త ఫీచర్‌ కూడా యూజర్లకు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా వాట్సాప్‌ ఫీచర్లు, సర్వీస్‌ గురించి యూజర్లు తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు. యాప్‌ వినియోగం గురించి తమ అభిప్రాయాలు తెలియజేయమని కోరుతూ వాట్సాప్ తన వెరిఫైడ్ ఖాతా నుంచి యూజర్లకు ఇన్విటేషన్‌ పంపుతుంది. దాన్ని ఓపెన్‌ చేసి యూజర్లు సర్వేలో పాల్గొంటూ అభిప్రాయాలను, సూచనలను తెలియజేయొచ్చు. ఒకవేళ సర్వేలో పాల్గొనకూడదనుకుంటే వాట్సాప్‌ పంపిన ఇన్విటేషన్‌ను రిజెక్ట్ చేస్తే సరిపోతుంది.

ఇదీ చదవండి: ఫైల్ షేర్, ప్రింట్, క్లౌడ్ స్పేస్​.. వైఫై రౌటర్లలోని 6 ఎక్స్​ట్రా ఫీచర్స్​ తెలుసా?

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. పాత మెసేజ్‌ల సెర్చ్‌ ఇక మరింత ఈజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.