ఆండ్రాయిడ్​లో 6 అద్భుత ఫీచర్లు- ఫోన్ టచ్ చేయకుండానే...

author img

By

Published : Dec 2, 2021, 6:06 PM IST

Top 6 features coming to new Android smartphones in 2022

Smartphone features: 2021 సంవత్సరం దాదాపు పూర్తయిపోయింది. ఈ ఏడాది ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన స్మార్ట్​ ఫోన్లు.. అద్భుత ఫీచర్లతో మనల్ని పలకరించాయి. మరి 2022లో మార్కెట్లోకి రానున్న ఫోన్లలో సరికొత్త ఫీచర్లను కోరుకోని వారుంటారా? అలాంటి 6 సరికొత్త ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Smartphone features: 2022లో విడుదలయ్యే ఆండ్రాయిడ్​ స్మార్ట్​ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఉంటాయోనని ఎప్పుడైనా ఆలోచించారా? క్వాల్​కామ్​.. స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 1 ప్రాసెసర్​ రాకతో వచ్చే ఏడాది ఫోన్లలో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

అయితే అన్ని స్మార్ట్​ ఫోన్లలో ఈ చిప్ ఫీచర్​​ ఉండాలని లేదు కానీ.. హై ఎండ్​ ఫోన్లు అయిన షియోమి, శాం​సంగ్​, ఒప్పో, సోనీ, వన్​ ప్లస్​ ఇతర మోడళ్లలో దీనిని పొందుపర్చే అవకాశాలు పుష్కలం.

మరి ఈ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 1 ఫ్లాగ్​షిప్​ ప్రాసెసర్​తో ఏమేం ఫీచర్లు వస్తాయంటే..

Always-on camera

ఈ ప్రాసెసర్​తో వచ్చే ఆసక్తికరమైన ఫీచర్లలో.. ఆల్వేస్​ ఆన్​ కెమెరా గురించి మొదట చెప్పుకోవాలి. మీ ఫోన్​ను ముట్టుకోకుండానే ఎన్నో కెమెరా ఫీచర్లను పొందొచ్చు.

  • ఫోన్​ను కనీసం టచ్​ చేయకుండానే.. ఫేషియల్​ రికగ్నిషన్​తో అన్​లాక్​ చేయొచ్చు.
  • ప్రస్తుత ఆండ్రాయిడ్​ ఫోన్లను స్టాండ్​ బై మోడ్​ నుంచి మేల్కొలిపేందుకు బటన్​ ప్రెస్​ చేయడం లేదా ఫోన్​ను తీయడం ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఇది అవసరం ఉండదు.
  • ఫోన్​ మీ పక్కన ఉన్నా ముట్టుకోకుండానే.. కెమెరా వైపు చూస్తే చాలు హోం స్క్రీన్​ ఫ్లాష్​ అయ్యి డిస్​ప్లే ఓపెన్​ అవుతుంది.
  • ఫోన్​ను అన్​లాక్​ చేయకుండానే.. క్యూఆర్​ కోడ్​లను కూడా స్కాన్​ చేయొచ్చు.

8K HDR video shooting

2022లో రానున్న ఫీచర్లలో 8కే హెచ్​డీఆర్​ వీడియో షూటింగ్​ ఒకటి.

  • స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 1 ప్రాసెసర్​తో కూడిన ఫోన్లతో.. 8K HDRలో వీడియోలు చేయొచ్చు. యాపిల్​ ఐఫోన్​ ప్రోలో కూడా వీడియో రికార్డింగ్​ సామర్థ్యం 4K వరకే అందుబాటులో ఉంది.
  • ఈ ఫీచర్​తో అత్యుత్తమ రిజల్యూషన్​లో వీడియో షూట్​ చేయొచ్చు.

Video Bokeh effect

ఇమేజ్​లో బ్యాక్​గ్రౌండ్​ బ్లర్​ చేయడం తెలిసే ఉంటుంది. ఫొటోల్లో అవసరం లేని ఆబ్జెక్ట్​ నాణ్యతను తగ్గించడం కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ వీడియో బొకే ఎఫెక్ట్​తో వీడియో బ్యాక్​గ్రౌండ్​లో కూడా బ్లర్​ చేయొచ్చు. ఏఐ సాంకేతికతతో ఈ ఫీచర్​ రూపొందింది.

ఈ ఫీచర్​ ఐచ్ఛికం(ఆప్షనల్​). అవసరం అనుకుంటే వాడొచ్చు.

Improved performance

ఇది అన్ని ఫోన్లకు తప్పనిసరి. స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 1 ప్రాసెసర్​ ఫోన్లు.. ఇతర అన్ని స్మార్ట్​ ఫోన్ల కంటే వేగంగా పనిచేస్తాయి.

  • ఫోన్​ పనితీరు 20 శాతం మెరుగుపడుతుంది.
  • ఈ ఫీచర్​ వస్తే మొబైల్​ గేమ్స్​ ఆడేటప్పుడు, బ్రౌజింగ్​ చేస్తున్నప్పుడు ఫోన్​ స్లో అయ్యే అవకాశమే లేదంటున్నారు నిపుణులు.

Lossless audio over Bluetooth

ప్రస్తుత ఫోన్లలో బ్లూటూత్​ హెడ్​ఫోన్స్​ ద్వారా పాటలు వినేటప్పుడు.. ఆడియో అంత స్పష్టంగా వినిపించకపోవచ్చు. వినియోగదారు రాజీ పడే ప్రసక్తే లేకుండా.. కొత్త చిప్​ ద్వారా ఆడియో క్లారిటీగా వినిపించేలా సాంకేతికత అందుబాటులోకి రానుంది.

స్నాప్​డ్రాగన్​ సౌండ్​ టెక్నాలజీకి సపోర్ట్​ చేసే హెడ్​ఫోన్స్​కు మాత్రమే ఈ ఫీచర్​ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి ఇవి తక్కువే ఉన్నా.. రాబోయే రోజుల్లో ఈ జాబితా పెరుగుతుందని టెక్​ నిపుణులు అంటున్నారు.

Even faster 5G connectivity

  • రాబోయే తరం స్మార్ట్​ఫోన్లలో 5G స్పీడ్​తో 10జీపీపీఎస్​ వరకు అత్యంత వేగంగా డౌన్​లోడ్లు చేసుకోవచ్చు. దీంతో 4K రిజల్యూషన్​ వీడియోలను సెకన్లలోనే డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.
  • పెద్దగా స్ట్రీమింగ్​ లేకుండానే.. 8K రిజల్యూషన్​తో వీడియో చాట్​ చేసుకోవచ్చు.

ఇవీ చూడండి: మీ ఐఫోన్​ ఇకపై మీరే రిపేర్​ చేసుకోవచ్చు!

ఆండ్రాయిడ్ ఫోన్‌ వాడుతున్నారా.. మరి ఈ మార్పులు చేశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.