ఇన్​స్టాగ్రామ్​కు భారీ షాక్.. రూ.3,500 కోట్ల జరిమానా.. ఎందుకంటే?

author img

By

Published : Sep 6, 2022, 11:41 AM IST

Irish regulators fine Instagram 405M euros for data breach

ప్రముఖ సామాజిక మాధ్యమమైన ఇన్​స్టాగ్రామ్​​పై ఐర్లాండ్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. ఐరిష్​ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

Irish regulators fine Instagram : టీనేజర్ల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన కేసులో ప్రముఖ సామాజిక మాధ్యమమైన ఇన్​స్టాగ్రామ్​​పై ఐర్లాండ్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. 405 మిలియన్ యూరోల (సుమారు రూ.3,500 కోట్లు) జరిమానా కట్టాలని ఆదేశించింది. ఈ విషయాన్ని ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ ఈ మెయిల్​ ద్వారా తెలియజేసింది. ఈ నిర్ణయాన్ని గత వారమే తీసుకున్నప్పటికీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.

ఐరిష్ నియంత్రణ విచారణలో బయటపడ్డ సమాచారం ప్రకారం.. ఇన్​స్టాగ్రామ్ 13 నుంచి 17 ఏళ్ల యువతకు సంబంధించిన ఈ మెయిల్​, ఫోన్​ నంబర్​ లాంటి సమాచారన్ని ఇన్​స్టాగ్రామ్ బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో ఐరిష్​ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ సామాజిక మాధ్యమంపై 405 మిలియన్ల యూరోల జరిమానాను విధించింది. ఈ నిర్ణయంపై ఇన్​స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ అయిన మెటా.. అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. అయితే, దీనిపై మెటా ఇంకా స్పందించలేదు. గతేడాది అమెజాన్ సంస్థపైనా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. దీంతో విచారణ చేపట్టి ఆ సంస్థపై 746 మిలియన్ యూరోల జరిమానా విధించింది లగ్జెంబర్గ్ ప్రభుత్వం. ఆ తర్వాత ఓ సంస్థపై విధించిన అతిపెద్ద జరిమానా ఇదే కావడం గమనార్హం.

ఇదీ చదవండి: రిషి సునాక్​ ఓటమి.. బ్రిటన్​ నూతన ప్రధానిగా లిజ్​ ట్రస్​.. మోదీ ట్వీట్​

Jagananna house అమ్మకానికి జగనన్న ఇళ్ల స్థలాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.