గూగుల్​ న్యూ యాప్​​.. హెల్త్, ఫిట్​నెస్ సమాచారమంతా ఒకచోటే..

author img

By

Published : Nov 19, 2022, 8:19 AM IST

Updated : Nov 19, 2022, 9:14 AM IST

Google Health Connect app

Google Health Connect: హెల్త్‌, ఫిట్‌నెస్‌ యాప్‌లలోని సమాచారాన్ని ఒకచోటే యాక్సెస్‌ చేసేందుకు వీలుగా గూగుల్ హెల్త్‌ కనెక్ట్ పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ యాప్‌ బీటా వెర్షన్‌ మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉంది.

Google Health Connect : హెల్త్‌, ఫిట్‌నెస్‌ సమాచారాన్ని ఎప్పటికప్పుడు యూజర్లకు తెలియజేసేందుకు హెల్త్‌ కనెక్ట్ పేరుతో గూగుల్ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. దీంతో ఆండ్రాయిడ్ ఆధారిత ఫిట్‌నెస్‌, హెల్త్‌ యాప్‌లలోని సమాచారాన్ని ఈ యాప్‌ ద్వారా ఎప్పుడైనా యాక్సెస్‌ చేయొచ్చు. చాలా మంది యూజర్లు హెల్త్‌, ఫిట్‌నెస్‌ కోసం వేర్వేరు యాప్‌లను ఉపయోగిస్తుంటారు. అందులోని డేటా కోసం ప్రతిసారీ ఆయా యాప్‌లను ఓపెన్‌ చేయాల్సిందే. ఈ సమస్యకు పరిష్కారంగా అన్ని యాప్‌లలోని సమాచారం ఒకచోట యాక్సెస్‌ చేసేందుకు వీలుగా గూగుల్ హెల్త్‌ కనెన్ట్ యాప్‌ను ప్రవేశపెట్టింది.

ఇతర హెల్త్‌, ఫిట్‌నెస్‌ యాప్‌ల నుంచి హెల్త్‌ కనెక్ట్‌లో షేర్‌ చేసే సమాచారానికి పూర్తి భద్రత ఉంటుందని గూగుల్ చెబుతోంది. ఈ యాప్‌తో సమాచారాన్ని పంచుకునేందుకు వీలుగా యూజర్లు తాము ఉపయోగిస్తున్న హెల్త్‌, ఫిట్‌నెస్‌ యాప్‌లలో డేటా షేరింగ్‌కు అనుమతించాలి. యూజర్లు పాత డివైజ్‌ నుంచి కొత్త డివైజ్‌కు మారుతున్నప్పడు యాప్‌లో స్టోర్‌ అయిన సమాచారం డిలీట్‌ అవుతుంది. హెల్త్‌ కనెక్ట్‌తో ఆ సమస్య ఉండదని గూగుల్ చెబుతోంది. ప్రస్తుతం హెల్త్‌ కనెక్ట్ యాప్‌ బీటా వెర్షన్‌ మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ యాప్‌ పరీక్షించాలనుకునే వారు ప్లేస్టోర్‌ నుంచి బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Last Updated :Nov 19, 2022, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.