LIve :చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బెంగళూరులో ఐటీ ఉద్యోగుల ఆందోళన.. ప్రత్యక్షప్రసారం
Published: Sep 15, 2023, 3:15 PM

Bengaluru IT Employees Protest for CBN : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇటీవల సాప్ట్ వేర్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్షతోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని అర్థరాత్రి అరెస్ట్ చేశారంటూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. 'అయామ్ విత్ సీబీఎన్' ప్లకార్డులతో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. విప్రో సర్కిల్లో జరిగిన ఈ నిరసనలో వేలాది మంది ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. 'సైకో పోవాలి - సైకిల్ రావాలి' అంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు నినాదాలు చేశారు. వెంటనే చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు ఉపసంహరించుకోని.. ఆయనను విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలు నిలిచిపోకుండా చర్చలు చేపట్టారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ఇప్పుడు బెంగుళూరులో కూడా ఐటీ ఉద్యోగులు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిరసలు చేపట్టారు.