LIVE: తిరుమల శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం కార్యక్రమం .. ప్రత్యక్ష ప్రసారం
Published: Sep 19, 2023, 8:01 AM

LIVE: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా ప్రారంభయ్యాయి.సోమవారం సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగుర వేశారు. ఈ కార్యక్రమంతో ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మొదటిగా సంప్రదాయ బద్దంగా బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద చేరుకొని దర్శనం చేసుకున్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గర్భాలయంలోకి వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సీఎంకు రంగనాయకుల మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు, పండితులు వేదాశీర్వచనం అందజేశారు. 2024 సంవత్సరం టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి విడుదల చేశారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈరోజు ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు... ప్రత్యక్షప్రసారం