ప్రజాకర్షక హామీలతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల - ప్రత్యక్ష ప్రసారం
Published: Nov 17, 2023, 1:00 PM

Congress Manifesto Release Live : సబ్బండ వర్గాలను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా శ్రీధర్‌బాబు నేతృత్వంలోని కమిటీ వివిధ వర్గాలను సంప్రదించి పలు అంశాలను ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ అమరవీరుల కుటుంబ సభ్యులకు నెలకు రూ.25,000 పింఛన్ సహా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల పంట రుణమాఫీతో పాటు 3 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని మరింత స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అవకతవకల ఆరోపణలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తామని తెలిపినట్లు సమాచారం. తాజాగా హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు.