LIVE: టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశం- ప్రత్యక్ష ప్రసారం
Published: Nov 14, 2023, 1:12 PM

TDP Varla Ramaiah Press Meet Live: దళిత న్యాయవాదిపై వైసీపీ కార్యకర్తల దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. విజయ్ కుమార్ను చెప్పులతో కొట్టిన ప్రతి ఒక్క వైసీపీ సైకోని అవే చెప్పులతో ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. బనగానపల్లె నియోజకవర్గంలో అధికార పార్టీ అక్రమాలను వెలికితీస్తుండటం, టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో.. విజయ్ గోపాల్ను వైసీపీ నేతలు లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. కొలిమిగుండ్లలో ఇంట్లో ఉన్న అతడిని బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరుడు నాగేశ్వరరావు సహా కొందరు మహిళలు బయటకు తీసుకువచ్చి దాడికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరవైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలు, సానుభూతిపరులపై దారుణంగా దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీ వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీకోసం..