LIVE: పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ ఎంపీలు.. ప్రత్యక్ష ప్రసారం
Published: Sep 17, 2023, 10:14 AM

TDP Parliament Leaders Live: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం దిల్లీలో జరగింది. ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో తెలుగుదేశం ఎంపీలందరు మధ్యాహ్నం భేటీ అయ్యారు. పార్లమెంట్ ఉభయసభ చర్చల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు గురించే ఉండేలా ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గురించి పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లేలా నేతలు వ్యూహ రచన చేశారు. వివిధ పార్టీల మద్దతుతో చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంపై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చకు తీసుకురావటం కోసం కసరత్తుతో అందుకు అనుసరించాల్సిన విధానంపై వారు సమాలోచన చేశారు. అయితే, ఇప్పటి వరకు టీడీపీ పార్లమెంటరీ సమావేశాలు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగాయి. ఇప్పుడు ఆయన జైలులో ఉండటంతో తొలిసారిగా నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరిగింది. జాతీయ స్థాయిలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఎత్తి చూపుతూనే, రాష్ట్రంలో ఏలుతున్న నియంత పాలనను ఎండగట్టాలని నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. కాగా దీనిపై పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీలు ప్రసంగిస్తున్నారు.. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో, మీకోసం..