Live: రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు.. ప్రత్యక్షప్రసారం
Published: May 27, 2023, 9:15 AM

Mahanadu Live: మహనాడు వేదికగా ఎన్నికల శంఖారావం పూరించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఏడాది లోపే ఎన్నికలు జరగనుండటంతో పార్టీ నాయకులకు, శ్రేణులకు రాజమహేంద్రవరం మహానాడు వేదికగా దిశానిర్దేశం చేయనుంది. యువత నూతనోత్తేజం నింపేలా సరికొత్త ప్రణాళికలు రచించారు. మహానాడు వేదికగా శ్రేణులను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేసేలా చంద్రబాబు స్ఫూర్తి నింపనున్నారు. మహానాడు వేదికగానే నేడు ఎన్నికల తొలి మేనిఫెస్టో సైతం ప్రకటించనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించనున్న మహానాడుకు రాజమహేంద్రవరం పసుపుమయంగా మారిపోయింది. భారీ స్వాగత తోరణాలు, తెలుగుదేశం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో మహానాడు వేదిక కొత్త కళ సంతరించుకుంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి వద్ద రెండు రోజుల పాటు నిర్వహించనున్న మహానాడుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంతోపాటు ...ఎన్నికల ఏడాదికావడంతో చరిత్రలో నిలిచిపోయేలా ఈసారి మహానాడును తెలుగుదేశం పార్టీ వైభవంగా నిర్వహిస్తోంది. డు తొలిరోజు ప్రతినిధుల సభ నిర్వహించనుండగా.. రేపు బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ప్రతినిధుల సభ కోసం 10 ఎకరాల్లో, బహిరంగ సభ కోసం 60 ఎకరాల్లో ప్రాంగణాలు, వేదికలు సిద్ధం చేశారు. 15 వేల మంది పార్టీ ప్రతినిధులకు ఆహ్వానాలు పంపగా.. వీరితోపాటు మరో 35 వేల మంది కార్యకర్తలు రానున్నట్లు సమాచారం.