LIVE: సీబీఐతో దోబూచులాడుతున్న అవినాష్ రెడ్డి.. వర్ల రామయ్య మీడియా సమావేశం
Published: May 19, 2023, 4:14 PM

VARLA RAMAIAH PRESS MEET LIVE వివేకా హత్య కేసులో సీబీఐతో అవినాష్ రెడ్డి దోబూచులాడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నేడూ కూడా విచారణకు హాజరు కాలేదు. విచారణ నిమిత్తం సీబీఐ కార్యాలయానికి బయలుదేరి.. మార్గమధ్యలోనే ఆయన పులివెందులకు పయనమయ్యారు. తన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్య కారణాల దృష్ట్యా విచారణకు రాలేనని పేర్కొంటూ సీబీఐకు ఆయన లేఖ పంపడంపై.. టీడీపీ నేతలు విమర్శల దాడికి దిగారు. గత 16వ తేదిన కూడా ఇదే విధంగా చివరి నిమిషంలో సీబీఐ విచారణకు డుమ్మా కొట్టాడని గుర్తు చేస్తున్నారు. ఇలా తనకున్న పలుకుబడితో ఏదో రూపంలో సీబీఐ విచారణను అడ్డుకునేందుకు అవినాష్‌రెడ్డి యత్నిస్తున్నాడని.. దీనికి వెనక సీఎం జగన్ ఉన్నాడని వారు ఆరోపిస్తున్నారు. విచారణలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. ప్రత్యక్షప్రసారంలో వీక్షించండి..