LIVE పదేళ్ల క్రితం సామాన్యుడు - నేడు ఆర్థికంగా అసామాన్యుడు! వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశం
Published: Nov 18, 2023, 5:16 PM

TDP Leader Varla Ramaiah: పదేళ్ల క్రితం సామాన్యుడు.. నేడు ఆర్థికంగా అసామాన్యుడని.. అతనే అవినీతి సామ్రాట్ ఏ2 విజయసాయి రెడ్డి అని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలు, అవినీతి అనేకం అంటూ వర్ల ఆరోపణలు చేశారు. అయితే విజయసాయిరెడ్డి ఇప్పటికే అనేక అక్రమాలు చేశాడని.. ప్రతిపక్షం విమర్శిస్తునే ఉంది. "వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమాలపై సీబీఐ, ఈడీలతో కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ... ‘నగరంలో రూ.45 వేల కోట్ల విలువైన ఆస్తులను విజయసాయిరెడ్డి, ఆయన బినామీలు ఉమేష్, గోపీనాథ్‌రెడ్డి, సుబ్బరాజు దోచుకున్నారు. దసపల్లా భూములను బినామీలకు కట్టబెట్టి లబ్ధి పొందుతున్నారు. భీమిలి రోడ్డులో బేపార్కు, కార్తికవనం భూములనూ స్వాహా చేశారు. రామానాయుడు స్టుడియో భూములను తీసుకొని అక్కడ సీఎం జగన్ భార్య కోసం ఇల్లు నిర్మించే ఆలోచనలో ఉన్నారు. భోగాపురం విమానాశ్రయం వద్ద లక్ష చదరపు గజాల స్థలాన్ని విజయసాయి బంధువులు కొనుగోలు చేశారు. మూడేళ్లలో ఉత్తరాంధ్రకు ఒక్క ప్రాజెక్టునూ తేలేకపోయారు. దీనిపై ఉత్తరాంధ్ర సీనియర్ నేతలుగా చెప్పుకొంటున్న మంత్రులు బొత్స, ధర్మానలు ఎందుకు నోరు మెదపడంలేదు. విజయసాయి లొసుగులన్నీ ముఖ్యమంత్రికి తెలిసినా మాట్లాడడం లేదు." అని గతంలో టీడీపీ ప్రశ్నించింది.