LIVE జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడి జరగని రోజు లేదు.. టీడీపీ నేత తెనాలి శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం..
Published: Nov 18, 2023, 4:09 PM

TDP Tenali Shravan Kumar : జగన్ రెడ్డి సైకో పాలనలో దళితులపై దాడి జరగని రోజు లేదంటూ టీడీపీ నేత తెనాలి శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు.ఇటీవల రాష్ట్రంలో దళితులపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ దారుణాలపై ప్రతిపక్షాలు మండిపడుతూనే ఉన్నారు. అయినా అంతకంతటికీ దళిత ప్రజలపై అమానుష ఘటనలు పేట్రేగిపోతూనే ఉన్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇంతకంటే దారుణం ఉండదు అనుకున్న ప్రతిసారి.. అంతకన్నా హేయంగా, దారుణంగా కొనసాగుతునే ఉన్నాయి రాష్ట్రంలో దళితులపై దాడులు. తిట్టడం, కొట్టడం, గుండు గీయించడం, కస్టడీలో మరణాలు, చిన్నచిన్న కారణాలకే చావబాదడం, చంపి డోర్ డెలివరీ చేయడం. వెంటాడి వేధింపులు, ప్రాణాల తీయడం ఇలా ఎన్నెన్నో దాష్టీకాలు ఈ దమనకాండలో. నాలుగున్నరేళ్ల జగనన్న ఏలుబడిలో రక్షణలేకుండా పోతున్న బడుగుల జీవితాలకు సంబంధించి ఇప్పుడు మరో నిర్ఘాంతపోయే ఘటన వెలుగుచూసింది.ఇటీవల హోంమంత్రి తానేటి వనిత ఇలాకాలో దళిత యువకుడి మృతి సంచలనం రేపిన విషయం విధితమే. ఈ క్రమంలో టీడీపీ నేత తెనాలి శ్రావణ్ కుమార్ ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతున్నారు.